టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలిసారిగా ప్రాణం ఖరీదు సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయమైన చిరంజీవి ఆ తర్వాత మనఊరి పాండవులు, పునాదిరాళ్ళు వంటి సినిమాల్లో కూడా నటించారు. వాటి అనంతరం ఎన్టీఆర్, కృష్ణ సహా పలువురు నటుల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన చిరంజీవి ఆపై హీరోగా మారి పలు సినిమాలు చేసారు. అయితే కెరీర్ పరంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా మెగాస్టార్ చిరంజీవికి హీరోగా అతి పెద్ద బ్రేక్ నిచ్చింది.

అక్కడి నుండి మరింత వేగవంతంగా ముందుకు కొనసాగిన చిరంజీవి ఆపై ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మెగాస్టార్ నుండి సినిమా వస్తుంది అంటే థియేటర్స్ వద్ద ప్రేక్షకాభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఆ విధంగా అప్పట్లో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా దాదాపుగా రెండు దశాబ్దాల వరకు మెగాస్టార్ కొనసాగారు. ఇక అసలు విషయం ఏమిటంటే 1990వ దశకంలో అప్పటి జాతీయ పత్రిక ఇండియా టుడే లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం ఆ సమయంలో యావత్ భారతదేశం లోని హీరోల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా గొప్ప రికార్డును సొంతం చేసుకున్నారు.

నిజానికి మెగాస్టార్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసి ఆ సమయంలో అగ్రనటులుగా కొనసాగుతున్న అమితాబచ్చన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి వారు సైతం ఆశ్చర్యపోయేవారట. ఆ విధంగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుండి జాతీయ స్థాయి వరకు తన కీర్తి ప్రతిష్టలను విస్తరింపచేసిన మెగాస్టార్ ఇప్పటికీ కూడా అదే వన్నె తరగని చరిష్మాతో సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. ఇక ఇటీవల సైరా నరసింహారెడ్డి మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: