ఒకప్పుడు యూ ట్యూబ్ స్టార్ గా రాణించిన ముద్దు గుమ్మ చాందిని చౌదరి. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా ఎదిగింది. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసి నటి గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె "బ్రహ్మోత్సవం", "లై "వంటి సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన చిత్రం "కలర్ ఫోటో " .ఈ మూవీ గతేడాది విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా థియేటర్ విడుదల కాకుండానే ఓటీటీ లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని సక్సెస్ బాట పట్టింది.


అంతే కాకుండా ఇందులో నటించిన హీరోయిన్ కు మంచి ప్రశంసలు కూడా అందాయి. అదే సమయంలో మూవీతో పాటు ఆమె తొలిసారిగా హీరోయిన్ గా నటించిన "సూపర్ ఓవర్"చిత్రం కూడా ఓ టీ టీ లోనే విడుదలైంది. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో వచ్చినప్పటికీ, చాందినీ కి  కలర్ ఫోటో మూవీ నే  మంచి విజయాన్ని అందించింది. అంతేకాకుండా ఈమెను  హీరోయిన్ గా గుర్తించిన మూవీ గా కూడా పేరొందింది.

ఇంతటి సక్సెస్ అందుకున్న ఈ  హీరోయిన్  ను పలువురు ఇంటర్వ్యూ చేయగా అందులో ఆమె విస్తుపోయే నిజాలను బయటపెట్టింది.. ఇక ఈ క్రమంలో తనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తాజాగా అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాందిని మాట్లాడుతూ.." ఇక్కడ తెలుగు హీరోయిన్స్, బయట హీరోయిన్స్ కంటే రెట్టింపు కష్టపడాలి. అయినా కూడా వారికి అవకాశాలు వస్తాయని నమ్మకం లేదు. నేను కనీసం కొన్ని సినిమాల లో నటించ గలిగాను. నా కంటే ముందుగా పరిశ్రమకు వచ్చిన వారికి అవకాశాలు దొరక్క ఎదురుచూస్తున్నారు.

ప్రారంభంలో మీరు ఏమైనా వివక్షకు గురయ్యారా? అని అడగ్గా..ప్రస్తుతానికి నాకు నటిగా , హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఇలాంటి వాటి గురించి నేను అంతగా మాట్లాడలేకపోవచ్చు. అయితే హీరోయిన్ అవ్వకముందు కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. బయట హీరోయిన్స్ తో పోలుస్తూ  "నువ్వు ఏమంత కలర్ లేవు"అంటూ హేళన చేశారని వెల్లడించింది. అంతేకాకుండా ఇప్పటికీ సమాజంలో వర్ణవివక్ష ఉండడం చూసి చాలా ఆశ్చర్యం వేసింది" అని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: