సినీ ఇండస్ట్రీలో హీరోలు ఏళ్ల తరబడి సినిమాలు చేస్తారు. వందల సినిమాల్లో హీరోలుగా చేసి కోట్ల మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటారు. కానీ.. హీరోయిన్ల విషయంలో అలా ఉండదు. వెండితెరపై కేవలం కొన్నేళ్లు మాత్రమే హీరోయిన్ల కెరీర్ ఉంటుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోతాయి. కనుమరుగైపోతారు. ఒకవేళ ఆ హీరోయిన్లు ఇండస్ట్రీలోనే ఉన్నా.. అక్క, చెల్లి అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసుకోవాల్సిందే. తరతరాలుగా సినీ ఇండస్ట్రీలో ఇదే కొనసాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. 

కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం దీనికి భిన్నంగా వయసు మీదపడుతున్నా.. ఇండస్ట్రీలో చక్రం తిప్పుతూనే ఉంటారు. స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతూనే ఉంటారు. అలాంటి వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అలాంటి హీరోయిన్లలో ఒకరు నయనతార. ఒకప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారును మత్తెక్కించిన మత్తుకళ్ల సుందరి ఇప్పుడు నటనతో మతిపోగొడుతోంది.

నయనతార అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సీత పాత్రతో భక్తి పండించినా.. స్విమ్ సూట్‌లో అందాలు ఆరబోసినా ఆమెకే సొంతం. నటనతో కూడా అదే రేంజ్‌లో మార్కులు కొట్టేస్తుంది. కోలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటినుంచే మంచి అవకాశాలు దక్కించుకుంటూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో సైతం అదే ఊపు కొనసాగించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సీనియర్ స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేశారంటే నయన డిమాండ్ ఏంటో అర్థమవుతుంది.


డిమాండ్‌కు తగ్గట్లే ఆమె రెమ్యునరేషన్ పెంచినా మారు మాట్లాడకుండా అడిగినంతా ముట్టజెప్పేవారు దర్శకనిర్మాతలు. మరో విచిత్రం ఏంటంటే నయన స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్న తరువాత చాలా వరకు ప్రమోషన్స్‌కి దూరంగానే ఉంది. ఈ విషయంలో కూడా దర్శక నిర్మాతలకు తనవల్ల కాదని తెగేసి చెప్పేసిందట. అయినా ఆమెను వదులుకునేందుకు ఎవరూ ఇష్టపడలేదు.

సినిమా ఇండస్ట్రీ పేరు, స్టేటస్, సక్సెస్ ఎంతలా ఇస్తుందో.. అందే వేగంగా వాటిని లాగేసుకోగలదు. వ్యక్తిగత జీవితాల్లో సంభవించే వివాదాలే దీనికి ప్రధారన కారణంగా నిలుస్తాయి. వారి కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాయి. కానీ నయన విషయంలో అలా జరగలేదు. ఆమె అన్‌సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీస్ చాలానే ఉన్నా.. అవన్నీ బయటకు తెలిసినా ఆమె కెరీర్‌ను మాత్రం డ్యామేజ్ చేయలేకపోయాయి. ఇప్పటికీ ఆమె స్పీడ్‌కు బ్రేకులు వేయలేకపోతున్నాయి.

కాగా.. నయన  ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఆమె దృష్టంతా కోలీవుడ్‌మీదే ఉంది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్ మూవీ నిఝల్‌తో ఈ ఏడాది మనముందుకు రావల్సి ఉంది. కానీ కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇక దీని తర్వాత మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ నేత్రికన్, అలాగే సూపర్ స్టార్ రజనీతో అన్నాత్తే సినిమా, కాతువాకుల రెండు కథల్ అనే సినిమా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: