నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని గత ఏడాది వి సినిమాతో పరిచయం అందుకున్నాడు.. దీంతో ఆయన ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన రెండు సినిమాలు చేస్తూ ఉండగా అందులో ఒక సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్కు సిద్ధంగా ఉంది. తాజాగా ఆయన చేయబోతున్న సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అందుతున్న సమాచారం మేరకు నాని మరో స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నారని అంటున్నారు. 


జెర్సీ సినిమాలో క్రికెట్ ఆటగాడిగా కనిపించి అలరించిన నాని మరో స్పోర్ట్స్ సినిమాలో కూడా నటించే అవకాశం ఉందని అంటున్నారు. నాని నటించబోయే సినిమా ఈసారి ఫుట్బాల్ నేపథ్యంలో ఉండబోతోందని అంటున్నారు. ఇప్పటికే దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో మాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.. ఆసక్తికరంగా ఈ సినిమా కొత్త డైరెక్టర్ తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. కథ మొత్తం పూర్తి అయితే ఈ సినిమా అధికారికంగా కూడా ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. 


నాని కెరీర్ లో ఎక్కువ స్పోర్ట్స్ డ్రామాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. కెరీర్ మొదట్లో ఉండగానే భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమాలో నటించాడు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమానే కాక జెర్సీ లో కూడా నటించారు. నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23న తెరపైకి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటించబడుతుంది. తర్వాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న “శ్యామ్ సింగ రాయ్” అనే సినిమాలో నాని నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: