ఇతర భాషల్లో టాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. చాలా సినిమాలు టాలీవుడ్ నుంచి వేరే భాషల్లోకి రీమేక్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. మంచి కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఏ భాషలో అయినా ఎంతటి ప్రేక్షకులనైనా అలరిస్తుంది అని చెప్పడానికి టాలీవుడ్ చిత్రాలే నిదర్శనం. అక్కడ హిట్ కొట్టి కొన్ని సినిమాలు టాలీవుడ్ స్థాయి నీ పెంచగా ఇతర భాషల్లోకి రీమేక్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన తెలుగు సూపర్ హిట్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వెంకటేష్ హీరోగా సెల్వరాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమా 5 భాషల్లోకి రీమేక్ అయ్యింది. వెంకటేష్ నటన, త్రిష అభినయం, కోట శ్రీనివాసరావు నటన కలిపి సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. బెంగాలీ, భోజ్ పురి, కన్నడ, ఒడియా తమిళ్ భాషలలోకి రీమేక్ చేయబడి అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. మహేష్ బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ఒక్కడు కూడా 5 భాషలలోకి రీమేక్ అయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో ఆల్ టైం హిట్ గా నిలవగా తమిళ కన్నడ హిందీ ఒడియ బెంగాలి భాషల్లో కూడా మంచి విజయం సాధించింది ఒక్కడు.

రాజమౌళి దర్శకత్వంలో సునీల్, సలోని జంటగా కీరవాణి సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మర్యాద రామన్న 5 భాషల్లోకి రీమేక్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగాలీ కన్నడ హిందీ తమిళ మలయాళ భాషల్లో ఈ సినిమా రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైం హిట్ గా నిలిచిన పోకిరి తమిళ్ కన్నడ బెంగాలీ హిందీ ఒడియా భాషలలోకి రీమేక్ చేయబడింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించిన ఇలియానా హీరోయిన్ గా నటించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా విక్రమార్కుడు కూడా కన్నడ తమిళం హిందీ బెంగాలీ బంగ్లాదేశ్ బెంగాలీ లో రెండుసార్లు రీమేక్ చేయబడి అన్ని చోట్ల సూపర్ హిట్ కొట్టింది. సిద్ధార్థ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కూడా అత్యధికంగా 9 భాషల్లోకి రీమేక్ అయ్యే అన్ని చోట్ల విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: