తెలుగు సినిమా పరిశ్రమలో అలనాటి నటుడు మాధవన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. ఎన్నో సినిమాలు సూపర్ హిట్ చేశారు మన ప్రేక్షకులు. తమిళ సినిమా పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకుని అక్కడ చేసిన ఆయన సినిమాలు అన్ని తెలుగులోనే విడుదల చేస్తూ ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ ను కూడా ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సౌత్ మొత్తం హీరోగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా తన సత్తా చాటాడు.

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో మార్కెట్  ఉండి సినిమాలు చేసే సత్తా ఉన్న నటుడు ఎవరు అంటే మాధవన్ అనే చెప్పాలి. ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా ఏది అంటే 2010లో ఓం శాంతి అనే ఈ సినిమా ద్వారా ఆయన స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు గాని ఆయన తెలుగులో సినిమా చేయడానికి అవకాశం రాలేదు. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా కీరవాణి సంగీత సారథ్యంలో తెరకెక్కిన సినిమా సవ్యసాచి. ఈ సినిమాలో కీలకమైన ప్రతినాయకుడి పాత్రను పోషించాడు మాధవన్.

అయితే కథలో దమ్ము లేకపోవడంతో ఈ సినిమాను ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ఫ్లాప్ సినిమాగా ఈ సినిమాను డిసైడ్ చేశారు. దాంతో చాలా రోజుల తర్వాత మాధవన్ చేసిన సినిమా ఇలా అయిపోయింది ఏంటి అని ఆయన అభిమానులు బాధపడ్డారు. ఇక మాధవన్ అనుష్క జంటగా చేసిన నిశ్శబ్దం సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఆయన అభిమానులు. ఈసారైనా హిట్ కొడతాడో అని ఎదురుచూసిన వారికి మళ్లీ నిరాశ తప్పలేదు. అత్యంత దారుణంగా ఈ సినిమా ఫ్లాప్ అయి మాధవన్ కి మళ్లీ చెడ్డ పేరు తీసుకు వచ్చింది. ఇలా మాధవన్ చేసిన రెండు డైరెక్ట్ తెలుగు చిత్రాలు అత్యంత దారుణమైన ఫ్లాప్ లు గా మిగలగా మళ్లీ ఆయన ఎప్పుడు సినిమా చేస్తారో.. ఎప్పుడు హిట్ కొడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: