ఒకప్పుడు వరుస సినిమాలలో బిజీగా ఉన్న కుర్ర హీరో లలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. హిట్స్ అండ్ ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఉండేవారు. మొట్ట మొదటి సినిమాతో విజయం సాధించి, హ్యాట్రిక్ విజయాలతో మొదలుపెట్టిన ఈ హీరో ఇక స్థానాన్ని హీరోల విషయంలో మరింత మెరుగు పరుచుకునే ఉంటాడో అని అంతా అనుకుంటూ ఉండగా, ఒకటి తర్వాత  ఒకటి వరుస ఫ్లాప్ లతో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ని ఆల్మోస్ట్ కోల్పోయే స్టేజ్ వరకూ రాజ్ తరుణ్ వచ్చేశాడని చెప్పవచ్చు.

ఏకంగా 6 సంవత్సరాలుగా  క్లీన్ హిట్ కి దూరమైన హీరోతో , బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్  మూవీ ని తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు . ఇక బాలీవుడ్ లో రెండేళ్ల క్రితమే రిలీజ్ అయిన ఆయుష్మాన్ ఖురానా నటించిన " డ్రీమ్ గర్ల్ " సినిమా సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిచి,  బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. దాదాపుగా రూ.140 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమానే, తెలుగులో రీమేక్ చేయబోతున్నారు హీరో రాజ్ తరుణ్.

దాదాపుగా తను తీసిన రీసెంట్ సినిమాల్లో ఒక్కటి కూడా యావరేజ్ హిట్ టాక్ ని అందుకోలేదు.  అలాంటి రాజ్ తరుణ్ కి తెలుగులో "ఈడోరకం ఆడోరకం " మల్టీస్టారర్ సూపర్ హిట్ తర్వాత, ఎనిమిది సినిమాలలో సోలో హీరోగా నటించినప్పటికీ,  అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ ను చవి చూశాయి. ప్రస్తుతం స్టాండ్ అప్ రాహుల్ సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు రాజ్ తరుణ్. ఆ సినిమా తరువాత ఛాంపియన్ అనే మరో సినిమాకి కమిట్ అయ్యాడు రాజ్ తరుణ్.

అయితే ఈ సినిమాలు అన్నిటికంటే డ్రీమ్ గర్ల్  సినిమా పైనే ఎక్కువ ఆశలు ఉన్నాయట. ఇంకా మొదలు గాని ఈ సినిమాపై వార్తలు చాలా రోజులుగా షికార్లు కొడుతూ ఉండగా, ఈ సినిమా ఎప్పుడు మొదలయి, పూర్తి అయ్యాక, ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీసు దగ్గర మంచి హిట్ ఇస్తే మాత్రం, సాలిడ్ కం బ్యాక్ ఇస్తానన్న నమ్మకంతోనే  రాజ్ తరుణ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారైనా హీరో గా ప్రూవ్ చేసుకుంటాడో? లేదో? వేచి చూడాలి మరీ.



మరింత సమాచారం తెలుసుకోండి: