ఇక 2013లో సంక్రాంతి కానుకగా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో మహేష్ చిన్నోడు గా అలానే వెంకీ పెద్దోడు గా ఒకరిని మించేలా మరొకరు ఎంతో అద్భుతంగా నటించారు అనే చెప్పాలి. సినిమాలో మహేష్, వెంకటేష్, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సీన్స్ తో పాటు ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ హృద్యంగా ఉండడంతో పాటు అందరి మనసుని తాకుతాయి. వాస్తవానికి ఈ సినిమాలో మహేష్ స్థానంలో పవన్ కళ్యాణ్ నటించాల్సిందని అప్పట్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అలానే చాలా ఏళ్ళ తరువాత టాలీవుడ్ లో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఇదే అని చెప్పాలి.
అంతకముందు కూడా పలు మల్టీస్టారర్ మూవీస్ వచ్చినప్పటికీ అవి చిన్న, పెద్ద హీరోల కలయికలో తెరకెక్కాయి. ఇక ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్రీకాంత్ అడ్డాల అద్బుతమైన టేకింగ్, సమంత, అంజలిల అందం అభినయం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్ర ఈ మూవీకి ప్రధానాకర్షణ గా నిలిచాయని చెప్పాలి. మనుషులు అందరూ మంచివారే అంటూ అందరి విషయంలో ఎంతో పాజిటివ్ గా వ్యవహరించే ఆయన పాత్ర ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మొత్తంగా సీతమ్మ వాకిట్లో మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంతో అలరించిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో ఒకటి అనే చెప్పాలి .... !!