టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.క్లాస్ తో పాటూ మాస్ ఆడియన్స్ లో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నాడు తారక్.అయితే nఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ కి మాస్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా చేసేటప్పటికి ఎన్టీఆర్ కి కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.నూనూగు మీసాల వయసులోనే ఈ నందమూరి వారసుడు.. ఆ సినిమాలో అత్యద్భుతమైన నటనను కనబర్చి..తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. 

2002 న విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక మొదటి సినిమాతోనే దర్శకుడు వి.వి.వినాయక్ ఏకంగా, తొలి దర్శకుడిగా ఉత్తమ చిత్రం విభాగంలో నంది అవార్డును కూడా గెలుచుకున్నాడు.దీంతో పాటు ఈ సినిమా 2003 లో ఫిల్మ్ ఫేర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది  ఈ చిత్రంలో, జూనియర్ ఎన్.టి.ఆర్ రాయలసీమలో తన కుటుంబం యొక్క వారసత్వాన్ని కొనసాగించే ఆది కేశవ రెడ్డి అనే విద్యార్థి పాత్రను పోషించారు. అప్పటి టాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఆధారంగా రూపొందించిన అనేక చిత్రాలలో ఇది ఒకటి. 


ఇక సినిమాలో ఎన్టీఆర్ సరసన కీర్తీ చావ్లా హీరోయిన్ గా నటించింది. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి మణిశర్మ అద్భుతమైన పాటలను అందించారు. అప్పట్లో 106  సెంటర్లలో 50రోజులు,96 సెంటర్లలో సినిమా వంద రోజులు, 3 సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకొని..  భారీ కలెక్షన్స్ తో రికార్డులు సృష్టించింది.నిజం చెప్పాలంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజే మారిపోయింది. చాలా చిన్న వయసులో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోగా ఎన్టీఆర్ 'ఆది' సినిమాతో రికార్డ్ నెలకొల్పాడు.ఇక తెలుగు లోనే కాకుండా ఈ సినిమాని తమిళంలో 'జై' అలాగే బెంగాలీ లో 'సూర్య' అనే పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాలను కైవశం చేసుకుంది. సో మొత్తానికి ఎన్టీఆర్ కెరీర్లో ఆది సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: