తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పిస్తూ ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. ఆ తరువాత వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచాడు రామ్ చరణ్ తేజ్.

ఇక రామ్ చరణ్ ఒక్క వైపు సినిమాలను చేస్తూనే మరోవైపు బిజినెస్ లో రాణిస్తున్నారు. ఆయన కొణిదెల ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసి అందులో తన తండ్రి సినిమాలను నిర్మిస్తున్నారు. అంతేకాదు.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ రామ్ చరణ్ దూసుకుపోతున్నాడు. ఇక రామ్ చరణ్ అపోలో కంపెనీ వైస్ చైర్మన్ హోదాలో ఉండే ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

రామ్ చరణ్ తన రెండో సినిమాను ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాను నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ ఈ మధ్య రంగస్థలం మూవీతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. అంతేకాదు.. మెగాస్టార్ తో ఆచార్య మూవీ నిర్మిస్తూ.. అందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు రామ్ చరణ్.

ఇక ఇంతకీ ఉపాసనతో ప్రేమకు బీజం ఎక్కడ పడిందంటే..  స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్ లో.అలా అప్పుడు తొలిచూపులోనే ఒకరికొకరు ఇష్టపడ్డారంటా. ఆ తరువాత ఐదేళ్లపాటు తరచూ పలుచోట్ల కలుసుకుంటూ తమ ప్రేమను సాగించారు. ఇక వీరి ప్రేమ విషయం దగ్గర ఫ్రెండ్స్ కి కూడా తెలీకుండా జాగ్రత్త పడ్డారు. అయితే చివరకు పెద్దలను ఒప్పించి మరీ అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్నారు ఇద్దరు. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యూట్ కపుల్స్ లో ఒకరిగా ముద్రపడ్డ ఈ జంటకు పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు పూర్తయిపోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: