విజయ్ దళపతి.. అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.. కోలీవుడ్ లో సూపర్ స్టార్ హీరో.. ఎప్పుడూ భిన్న విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ప్రేక్షకులను ఆశ్చర్యంతో పాటు మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా పారితోషకం తీసుకుంటున్న ఏకైక నటుడిగా కూడా రికార్డు సృష్టించారు. ఇక కేవలం కోలీవుడ్ కు  మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కలిగి ఉన్న స్టార్ హీరో. ఈయన మొత్తం 64 చిత్రాలలో హీరోగా నటించి అనేక అవార్డులను కూడా గెలుపొందాడు. విజయ్ 8 విజయ వార్డులు అలాగే స్టేట్ ఫిలిం అవార్డ్స్ తో పాటు సైమా పురస్కారం కూడా పొందాడు. ఇక అంతే కాకుండా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ జాబితాలో 100 మందిలో ఒకరుగా చాలాసార్లు చేర్చబడ్డారు.సినీ ఇండస్ట్రీలో బాలనటుడిగా తన పది సంవత్సరాల వయసులోనే తమిళ వెట్రీ  అనే నాటకంలో నటించాడు . ఇక ఈయన తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో కూడా పలు సినిమాలలో నటించాడు. ఇక ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే విజయ్ తన పుట్టిన రోజు ఇంకా  రెండు రోజుల గడువు ఉండగానే, సోషల్ మీడియాలో ఈయన సంబంధించిన ఫోటోల హడావిడి మొదలైంది. నెటిజన్ల నుండి ఫాన్స్ మేడ్ పోస్టర్ల వరకూ కొన్ని వేల ట్వీట్లు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.ఇక సెవెన్ స్క్రీన్ మీడియా కూడా వినూత్నంగా ఆలోచించి, దళపతి విజయ్ నటించిన 64 సినిమాలకు సంబంధించిన లుక్ లతో పాటు ప్రస్తుతం ఆయన నటిస్తున్న 65 వ సినిమాకు సంబంధించిన లుక్ కూడా కలుపుకొని, ఒక పెద్ద పోస్టర్ ను  విడుదల చేయడం చాలా స్పెషల్ గా అట్రాక్షన్ గా ఉంది. సెవెన్ స్క్రీన్ మీడియా తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ పోస్ట్ ని విడుదల చేయగా, ప్రస్తుతం అది నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.64 సినిమాలను ఒకేచోట చూడలేని స్థితి లో , సెవెన్ స్క్రీన్ మీడియా వినూత్నంగా ఆలోచించి ఈ పోస్టర్ ను  విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా ఒక సినిమాకు, ఇంకో సినిమాకు ఏమాత్రం సంబంధం లేకుండా సరికొత్త లుక్ తో ప్రేక్షకులను అలరించాడు విజయ్. ఇక ఈ పోస్టర్ ను విడుదల చేసిన సెవెన్ స్క్రీన్ మీడియాకు విజయ్ అభిమానులు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: