స్వయం కృషితో ఎదిగారు చిరంజీవి. కెరియర్ మొదట్లో గుర్తింపు తెలియని ఎన్నో పాత్రలు చేసిన  చిరంజీవి అంచెలంచెలుగా తన సత్తా నిరూపించుకునీ మెగాస్టార్ గా ఎదిగారు. ప్రాణం ఖరీదు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కొణిదల శివశంకర వరప్రసాద్ కాస్త చిరంజీవి అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వెంకటరావు అంజనా దేవి దంపతులకు 1955 ఆగస్టు 22న జన్మించిన చిరంజీవికి ప్రస్తుతం 66 ఏళ్లు. చిరు, మెగాస్టార్  అనే ముద్దు పేర్లు ఉన్నాయి. నాగబాబు పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. విజయ దుర్గ మాధవరావు అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.

ఆయనకు తన కెరీర్ లో బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే ఖైదీ అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ సినిమాతోనే ఆయన మెగాస్టార్ గా మారారట. అప్పటివరకు యూత్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిసినిమా తరువాత ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేసుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని రెట్టింపు చేసుకున్నారు.  ఈయన కుమారుడు రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ స్టార్ హీరో.  కూతురు సుష్మిత కాస్ట్యూమర్.  శ్రీజ టాలీవుడ్ లో మరో హీరో అయిన కళ్యాణ్ దేవ్ భార్య.  ఏదో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ తో మెగాస్టార్ ఫ్యామిలీ లోని ప్రతి ఒక్కరూ ముడిపడి ఉన్నారు. 

ఆమధ్య రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన తనయుడు కి ఒక ప్రొడక్షన్ హౌజ్ కూడా ఉంది. ఇప్పటివరకు తన తండ్రి నటించిన రెండు సినిమాలను నిర్మించగా మూడో సినిమాను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కి ఇష్టమైన హీరో ఎన్టీఆర్, హీరోయిన్ సావిత్రి. ఇష్టమైన వంటకం ఫిష్.  హైదరాబాద్ చెన్నై అంటే చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం ఇష్టం.  ప్రాణం ఖరీదు మూవీ కి ఆయన 21వేల పారితోషకం తీసుకోగా ఇటీవలే 38 కోట్లు అందుకున్నారు. దాదాపు 1650 కోట్ల ఆస్తిపాస్తులు ఆయనకు ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లో విశాలమైన ఇంట్లో ఉంటున్నారు. దాదాపు 30 కోట్ల విలువైన విశాలమైన మరో ఇల్లు కూడా ఉంది. 6 ఖరీదైన కార్లు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: