సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పొందడం ఈజీ కానీ వచ్చిన అవకాశం హిట్టయ్యేలా మార్చుకోవడం అంటే ఆయనకు బాగానే సుడి తిరిగి ఉండాలి. అలా ఓ హీరోకి చేసిన తొలి సినిమానే హిట్ అయింది, తొలి సినిమా హిట్ అయింది అనుకుంటే రెండో సినిమా దానికి మించి సూపర్ హిట్ అయింది. ఇక మూడో సినిమా అంతకుమించి హిట్ కావడంతో మూడు సినిమాలతోనే స్టార్ హీరో గా మారాడు ఆ హీరో.  ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా.  తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్.

ఉయ్యాల జంపాల లాంటి చిన్న సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై పెద్ద హిట్ ను అందుకున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాతో బెస్ట్ మేల్ యాక్టర్ గా సైమా అవార్డు అందుకున్నారు. ఆ తరువాత ఆయన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేసిన సినిమా చూపిస్త మావ చిత్రం మాస్ ప్రేక్షకులను దగ్గరయ్యేలా చేస్తూ మాస్ హిట్ ను అందుకుంది. ఆ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.  ఇక మూడో సినిమా సుకుమార్ నిర్మాణంలో చేసిన కుమారి 21 ఎఫ్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హిట్ గా నిలవడం తో రాజ్ తరుణ్ నీ అందరూ ఎవరి కుర్రాడు అనుకునేలా చేసుకున్నాడు. 

అయితే ఈ మూడు సినిమాల హిట్ల తర్వాత రాజ్ తరుణ్ ఈ రేంజ్ లో హిట్ సంపాదించుకోలేక పోయాడు. కథల ఎంపికలో లోపం స్పష్టంగా కనిపించింది. దీనికితోడు క్రేజ్ కూడా తగ్గిపోతుండటంతో రాజ్ తరుణ్ చేసేదేమీ లేక బిలో యావరేజ్ హీరోగా మిగిలిపోయాడు. ఆయన కెరీర్ లో వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త, లవర్ , ఒరేయ్ బుజ్జి గా సినిమాలు కొంత పర్వాలేదనిపించాయి.  ఇటీవల వచ్చిన ఆయన తాజా చిత్రం పవర్ ప్లే దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన స్టాండప్ రాహుల్ అనే కామెడీ కమర్షియల్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ఆయన పడిపోయిన కెరీర్ నీ పైకి లేపుతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: