లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లిపై సినీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆమె పెళ్లిపై రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయే తప్ప ఎప్పుడో చెప్పడం ఆమె పేరెంట్స్ కు కూడా తెలియడం లేదు. కరోనా ఎప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి పోతుంది అనేది పెద్ద ప్రశ్న. ఆ విధంగానే నయన పెళ్లి  పెద్ద క్వశ్చన్ గానే మిగిలిపోతోంది. నయనతార, విఘ్నేష్‌ శివన్‌ గత ఐదేళ్లుగా ప్రేమ లోకంలో విహరిస్తున్నారు. సహజీవనం చేస్తూ దాంపత్య బంధాన్ని పెళ్లికి ముందే రుచి చూస్తున్నారు. పెళ్లి ఎప్పుడని  విఘ్నేష్ ను అడిగితే కరోనా బూచి చూపిస్తున్నాడు. ఇంతకీ నయనతార పెళ్లిపీటలు ఎక్కేది ఎప్పుడనేది అందరినీ ఊరిస్తున్న ప్రశ్న.

నయనతార అప్పట్లో ప్రభుదేవాతో పెళ్లి విషయంలో తొందరపడుతూ వచ్చింది. విఘ్నేష్‌ శివన్‌తో మ్యారేజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తోంది. విఘ్నేష్ తో ప్రేమలో ఉన్నానని చెప్పకపోయినా... ఆమె సోషల్‌ మీడియాలో ప్రియుడికి మాత్రమే ఓపెన్ అవుతుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంది. ఇతర దేశాలకు వెళ్లినపుడు దిగిన ఫొటోలు షేర్‌ చేస్తుంది. కానీ విఘ్నేష్‌ ప్రేమలో ఉన్నాను.. పెళ్లి చేసుకుంటానని మాత్రం చెప్పదు. ఇలా ఐదేళ్లు గడిపేసిన నయన త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

దక్షిణాదిన ఫేమస్ లవర్స్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది నయనతార, విఘ్నేష్. ఈ ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందనీ..  పెళ్లి కూడా అయిపోయిందన్న వార్తలు చాలాసార్లు వచ్చాయి. అవన్నీ రూమర్సే. ఇటీవల విఘ్నేష్‌ శివన్‌ రీసెంట్‌గా ఇన్‌స్టాలో  చిట్ చాట్‌లో పాల్గొన్నాడు. నయనతారను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ఓ నెటిజన్‌ సూటిగా అడిగేసరికి.. కరోనా తగ్గిన తర్వాత చేసుకుంటానన్న సమాధానం కూడా ట్రోల్ అయింది.

నయనతార, విఘ్నేష్ శివన్‌  పెళ్లి కోసం సినీలోకం వేచి చూస్తోంది. ముఖ్యమైన బంధువులను, స్నేహితులను ఫారిన్‌ తీసుకెళ్లడానికి ప్రస్తుతం అనుమతులు రావడం లేదు. పర్యాటకంపై ఆంక్షలు ఎత్తివేస్తే... మ్యారేజ్ చేసుకోవాలన్న ప్లాన్‌లో ఈ ప్రేమ జంట ఉందని తెలుస్తోంది. నయనతార ప్రస్తుతం రజనీకాంత్‌ 'అన్నాత్తే' మూవీతోపాటు.. విఘ్నేశ్ శివన్‌ దర్శకత్వంలో 'కాతు వాకుల రెండు కాదల్‌' మూవీలో విజయ్‌ సేతుపతితో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: