పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పటికి స్టార్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు అయితే అప్పటివరకు చేసిన సినిమాలు బాగానే ఉన్నా ఎందుకో ఆయనకు స్టార్ హీరో అనే ముద్రను తీసుకు రాలేకపోయాయి. అన్ని క్లాస్ చిత్రాలు అవడమో ఆయనకు స్టార్ హీరో అన్న బిరుదు పొందలేకపోయాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ప్లాప్ అయ్యింది. గోకులంలో సీత పర్వాలేదనిపించింది. సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు వంటి చిత్రాలు ఆయనకు హ్యాట్రిక్ హిట్ చిత్రాలను ఇచ్చిన అవి ఆయనతో పాటు అందరికీ పేరు తెచ్చి పెట్టాయి కానీ స్టార్ హీరో స్టేటస్ మాత్రం రాలేదు.

కానీ ఆ తర్వాత చేసిన బద్రి సినిమా పవన్ కళ్యాణ్ స్టామినా ని హీరో ని బాగా ఎలివేట్ చేసి స్టార్ హీరో గా మలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమీషా పటేల్ రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇప్పటికీ తుడిచిపెట్టుకొని ఆ బాక్సాఫీస్ రికార్డులను చూస్తే తెలుస్తుంది. పూరి జగన్నాథ్ మొదటి సినిమా కావడం తో ఈ సినిమా ను మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో మరో హైలెట్ గురించి చెప్పాలంటే హీరోకి ధీటుగా సాగిన ప్రకాష్ రాజ్ పాత్ర. నువ్వా నేనా అన్న రీతిలో ఆయన ఈ సినిమా లో నటించారు. అప్పటికి ప్రకాష్ కి మంచి పేరున్నా ఈ నందా పాత్రలో మెరిసి ఆ తర్వాత చాలా రోజులు ఆ పేరుతోనే పిలవబడ్డారట.

అంతలా ఆ పాత్ర ఆయనకు  మంచి గుర్తింపు తెచ్చింది. ఇక రమణగోగుల పాటలు సరేసరి. ఇప్పటికీ బంగాళాఖాతంలో అనే పాట మ్యూజిక్ సెన్సేషన్ గా మిగిలిపోయింది. ప్రతి హీరో కెరీర్ లో మొదట్లో పడాల్సినహిట్ సినిమా పవన్ కళ్యాణ్ తన ఐదో చిత్రానికి కొట్టి ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం అయన రాజకీయాల్లో, సినిమాల్లో రెండు రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. ఇటీవలే వకీల్ సాబ్ తో హిట్ కొట్టారు. మరి భవిష్యత్ లో ఇంకెన్ని మాస్ చిత్రాలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: