మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తరువాత వారిని సెటిల్ చేసే విషయంలో చాల కష్టపడుతూ ఉంటారు. అయితే సినిమాకు 5 కోట్లు పారితోషికం తీసుకునే నయనతార విఘ్నేష్ శివన్ ను పెళ్ళి చేసుకున్న తరువాత సెటిల్ కావడానికి అవసరం అయ్యే డబ్బు కోసం సినిమాలు చేస్తోంది అంటే ఎవరు నమ్మరు.


అయితే ఈవిషయాన్ని స్వయంగా నయన్ ప్రేమికుడు ఆమెకు కాబోయే భర్త స్వయంగా సోషల్ మీడియా ఛాట్ లో బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. నయనతార తో ఎంగేజ్ మెంట్ కూడ పూర్తి అయిన తరువాత ఇంకా పెళ్ళికి ఎందుకు ఆలస్యం అన్న ప్రశ్నకు చాల ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.


పెళ్ళికి ఆతరువాత వచ్చే అవసరాలకు చాల డబ్బు అవసరం అనీ అందుకనే ఆ డబ్బు సంపాదన కోసం నయనతార అదేవిధంగా తాను చాల కష్టపడుతూ ఉండటంతో తమ పెళ్ళి ఆలస్యం అవుతోంది అంటూ జోక్ చేసాడు. ఇదే సందర్భంలో మరొక నెటిజన్ కొంటెగా అడిగిన ప్రశ్నకు కూడ ఫన్నీ సమాధానం ఇచ్చాడు. ఈమధ్య నయనతారను కిస్ చేస్తున్న ఒక ఫోటో గురించి ఆ నెటిజన్ ప్రశ్నిస్తూ మీ ఇద్దరి రొమాన్స్ కు సంబంధించి ఒకే ఫోటో ఎందుకు ఇచ్చారు ఇంకా చాల ఫోటోలు కావాలి అంటూ అడిగిన ప్రశ్నకు విఘ్నేష్ శివన్ స్పందిస్తూ అలాంటి సమయంలో ఫోటోలు తీయడానికి మరొక వ్యక్తిని పెట్టుకోము కదా అంటూ చురకలు అంటించాడు.


నయనతార నెయ్యి అన్నం చికెన్ బాగా తయారు చేస్తుందని ఆ రెండు అంటే తనకు ప్రాణం అంటూ ఆమె ఫుడ్ సీక్రెట్ ను బయటపెట్టాడు. వాస్తవానికి వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా వీరిద్దరూ పెళ్ళి చేసుకోవడంతో కోలీవుడ్ మీడియా రకరకాల వార్తలు రాస్తోంది. దీనితో ఈ వార్తలకు చెక్ పెట్టడానికి విఘ్నేష్ శివన్ ఇలా ఫన్నీ గా స్పందించాడు అనుకోవాలి..






మరింత సమాచారం తెలుసుకోండి: