ప్రాణం ఖరీదు సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన అద్భుత నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు అనగా జులై 10న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రాణ మిత్రుడు బాబు మోహన్ తో కలిసి చేసిన సూపర్ హిట్ సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.



రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన మాయలోడు చిత్రంలో ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ బాబు మోహన్ చిత్రవిచిత్రమైన ప్రదేశాల్లో అన్వేషిస్తూ తండ్రిగా నటించిన కోట శ్రీనివాసరావుని ముప్పుతిప్పలు పెడతారు. అయితే ఈ హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక మామగారు సినిమా లో బాబు మోహన్, కోట శ్రీనివాసరావు బీభత్సమైన కామెడీని పండించి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. ఈ చిత్రంలో బాబు మోహన్ కోట శ్రీనివాసరావుతో "నీకు మర్యాద చూపిస్తాను అన్న, నువ్వు ఉండు" అంటూ పొలంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి గోసి విప్పిస్తాడు. ఈ సీన్ ఎంతలా పడిందంటే.. ఈ సీన్ గుర్తొచ్చినప్పుడల్లా సహజంగానే నవ్వు తన్నుకొస్తుంది.



మాయదారి మోసగాడు చిత్రం లో బాబు మోహన్ కోట శ్రీనివాసరావు కామెడీ సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయి. జపాన్ భాషలో కిడ్నీని "అత్తన్నకురితి" అంటారని బాబు మోహన్ చెబితే.. ఇంకా నయం తొట్టిలో కుడితి అనలేదని కోట శ్రీనివాసరావు ఫన్నీ డైలాగులు చెప్తుంటారు. ఈ చిత్రంలో ఒకరికొకరు పందాలు విసురుకుంటూ.. పందాల్లో పాల్గొని ప్రజల చేత కొట్టించుకుంటూ.. అభాసుపాలవుతూ విపరీతమైన కామెడీ పుట్టించారు.



ఇక స్నేహం కోసం సినిమాలో బాబు మోహన్ కొండ పైకెత్తుతానని పందెం కట్టి కోట శ్రీనివాసరావు ని ఫూల్ ని చేయడం.. ఇడ్లీలు తెమ్మని 500 నోట్లు ఇస్తే.. 500 రూపాయలతో వందలు ఇడ్లీలు చట్నీ, సాంబార్ లేకుండా తేవడం.. వంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఇప్పటికీ కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటాయి. ఇక వినోదం సినిమాలో కూడా వీళ్ళిద్దరూ కలిసి కామెడీ కొదవ లేకుండా చేశారు.



1994లో విడుదలైన "నంబర్ వన్" సినిమా లో నాయక్ నహీ ఖల్నాయక్ మై హు అంటూ బాబు మోహన్ కోట శ్రీనివాస్ రావు తో కలిసి పండించే కామెడీ కూడా సూపర్ గా ఉంటుంది. అక్క పెత్తనం చెల్లెలి కాపురం, చిన్నరాయుడు, పెళ్లి కొడుకు వంటి తదితర సినిమాల్లో కూడా బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కలిసి అద్భుతమైన కామెడీని పండించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో ఎవర్ గ్రీన్ కామెడీ పెయిర్ గా వీరిద్దరూ పేరు తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: