ప్రతినాయకుడి పాత్రలకు, బాబు మోహన్ తో కలిసి పండించే కామెడీ కి పెట్టింది పేరు కోట శ్రీనివాసరావు. ముఖ్యంగా కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ బాబు కాంబినేషన్ అంటే ఏ సినిమా అయినా సరే ఇట్టే హిట్  అవ్వాల్సిందే. ఈయన నటించిన ఎన్నో సినిమాలు దాదాపుగా విజయవంతమయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కమెడియన్ గా ,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా తమదైన శైలిలో నటించి, ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేవారు. దాదాపు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ వంటి పలు భాషా చిత్రాలలో కూడా నటించి, దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు.


కోటా శ్రీనివాస రావు  1947వ సంవత్సరం జూలై 10వ తేదీన జన్మించారు. అయితే ఈయనకు  డాక్టర్ కావాలనే ఒక లక్ష్యం ఉండేదట. కానీ నటన మీద ఆసక్తితో డాక్టర్ అవ్వాలనే కోరికను పక్కన పెట్టి, తిరిగి యాక్టర్ అయ్యారు. అలా 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా తెలుగు సినిమాలోకి అరంగేట్రం చేశారు. దాదాపు 750 చిత్రాల్లో నటించి, తొమ్మిది ఉత్తమ నటుడు అవార్డు లను  కూడా సొంతం చేసుకున్నాడు. దగ్గుపాటి రానా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా ద్వారా  ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును కూడా పొందాడు. ఇక 2015 సంవత్సరంలో ఆయన సినిమా రంగానికి చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు కూడా లభించింది.


అంతే కాదు ఈయన రాజకీయ నేతగా కూడా పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ఈస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీ (బిజెపి ) నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 1999 వ  సంవత్సరం నుంచి 2004  వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక ఆయన రుక్మిణీ అనే ఆవిడను  వివాహం చేసుకున్నారు . వీరికి ముగ్గురు పిల్లలు. అందులో ఒక కుమారుడు ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొడుకు వెంకట ఆంజనేయ ప్రసాద్. ఇక ఈయన కుమారుడు 2010 జూన్ 20వ తేదీన రోడ్డు ప్రమాదంలో కన్ను మూసారు. ఇక కొడుకు మరణంతో ఇప్పటికీ కోట శ్రీనివాసరావు కోలుకోలేదని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: