ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ తీవ్ర రోడ్డు ప్రమాదం పాలై మరణించిన విషయం తెలిసిందే. అయితే నేడు ఆయన స్వగ్రామంలో జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. జూన్ 26న కత్తి మహేష్ తన సొంత గ్రామమైన చిత్తూరు జిల్లా, యర్రావారి పాలెం మండలం, యలమంద గ్రామానికి కారు డ్రైవర్ తో కూడా బయల్దేరాడు. కానీ అక్కడికి చేరుకోకముందే నెల్లూరు రహదారిలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కళ్ళకు, తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయన దగ్గర్లోని హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కత్తి బంధువులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ ఆయనకు డాక్టర్లు పలు శస్త్రచికిత్సలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన చికిత్స కోసం రూ.17 లక్షలు ఇచ్చింది. కత్తి మహేష్ కోలుకుంటారని అంతా అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా నిన్న ఆయన చనిపోయాడు అంటూ సన్నిహితులు ప్రకటించారు.

ఈ ప్రమాదంలో కార్ డ్రైవర్ కి సీట్ బెల్ట్ ధరించడంతో ఎలాంటి గాయాలు కాలేదు. కత్తి మహేష్ మాత్రం సీట్ బెల్ట్ ధరించండి కారణంగా తీవ్ర గాయాల పాలయ్యాడు. కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ఇక కత్తి మహేష్ మృతదేహాన్ని నేడు చెన్నై నుంచి యలమంద గ్రామానికి తరలిస్తున్నారు. అయితే మృతదేహం వచ్చేసరికి ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో కుటుంబ సభ్యులు నేడు అంత్యక్రియలను వాయిదా వేసినట్లు సమాచారం. రేపు ఉదయం కత్తి మహేష్ అంత్యక్రియలు జరగనున్నాయి.

కాగా కత్తి మహేష్ కు భార్య, ఒక కొడుకు ఉన్నారు. కానీ ఆయన ఇప్పుడు తన భార్యతో కలిసి ఉండడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివే రోజుల్లో కత్తి మహేష్ ఓ బెంగాలీ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెనే వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ తరువాత భార్యాభర్తలిద్దరూ స్నేహపూర్వకంగా విడిపోయారు. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్, భోపాల్ లో ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: