ఒకప్పుడు హీరోలతో సమానంగా గుర్తింపు పొందిన వ్యక్తి "చంద్రమోహన్". ఈ నటుడు హీరోగా, కమెడియన్ గా సినిమాలలో నటించి, బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమాలలో నటించేటప్పుడు కొంత మంది హీరోయిన్లను స్టార్ హీరోయిన్ లుగా ఎదిగేలా చేశారు చంద్రమోహన్. కానీ ఈయన మాత్రం స్టార్ హీరో గా ఎదగలేకపోయారు. అయితే ఆ హీరోయిన్ లు ఎవరో చూద్దాం.

1) జయప్రద:
1976 లో కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కించిన చిత్రం "సిరిసిరిమువ్వ". ఈ చిత్రంలో చంద్రమోహన్, జయప్రద కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత జయప్రద తన సినీ జీవితాన్ని మార్చుకునే ఛాన్స్ కొట్టేసిందని చెప్పవచ్చు. ఏకంగా ఎన్టీఆర్ తో కలిసి అడవి రాముడు, యమగోల వంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ లో నటించింది.

2). శ్రీదేవి:"అనురాగాలు" సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి , ఆ తర్వాత 1978 లో"పదహారేళ్ళ వయసు"సినిమాలో చంద్రమోహన్ తో కలిసి నటించి, తనకంటూ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో చంద్రమోహన్ కూడా ఎంతో బాగా నటించారని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత కొండవీటి సింహం,ప్రేమాభిషేకం వంటి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

3). జయసుధ:
1978లో ప్రాణం ఖరీదు చిత్రం లో చంద్రమోహన్, జయసుధ నటించారు. ఆ తర్వాత కలియుగ శ్రీ, వింత కోడళ్ళు, ఇంటింటా రామాయణం అలా చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఈమె కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

4). విజయశాంతి:
1983లో పెళ్లి చూపులు చిత్రం లో విజయశాంతి, చంద్రమోహన్ నటించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి 1986 లో "ప్రతిఘటన" సినిమాలో నటించి, ఏకంగా ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్, నాగేశ్వరరావు, వెంకటేష్, కృష్ణ తదితర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అయితే వీరందరిని స్టార్ హీరోయిన్లుగా ఈయన సినిమాలు  చేసిన తర్వాతే ఎదిగారని చెప్పవచ్చు. కానీ ఈయన మాత్రం స్టార్ హీరో కాలేకపోయాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: