టాలీవుడ్ మరో బాలీవుడ్ లా మారబోతోందా ? అంటే... పరిస్థితి అలాగే కన్పిస్తోంది మరి. ప్రస్తుతం టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ కొనసాగుతోంది. బాలీవుడ్ లో ఇప్పటికీ వారసులు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ మృతి కారణంగా నెపోటిజం అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడిన విషయం తెలిసిందే. దానికి కారణం లేకపోలేదు. కొత్తగా వచ్చే నటీనటులను, బ్యాక్ గ్రౌండ్ లేని నటులను వీళ్లంతా తొక్కేస్తున్నారని, వీళ్లకసలు టాలెంట్ లేదని, నటీనటులకు అవకాశాలు దక్కకుండా చేస్తున్నారనేది వారి వాదన. బీటౌన్ లో ఖాన్ లు, కపూర్ ల ఫ్యామిలీలు పాతుకుపోయాయి. టాలీవుడ్ కూడా అలాగే కాబోతోందా అన్పిస్తోంది. తాజాగా నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే టాలీవుడ్ లో కూడా ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉందనిపిస్తోంది. 


ఇప్పుడు టాలీవుడ్ లో నాలుగవ తరం వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి అల్లు అర్హ తెరంగ్రేటం కన్ఫర్మ్ అయ్యింది. లెజెండరీ నటుడు అల్లు రామ లింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్... ఇప్పుడు అల్లు అర్హ. "శాకుంతలం" అనే భారీ చిత్రంలో "భరత్" అనే పాత్రలో కన్పించబోతోంది. ఈ విషయమై నేడే అధికారిక ప్రకటన వచ్చింది. గుణశేఖర్, సమంతల కాంబినేషన్ లో ఈ మూవీ రూపొందుతోంది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ టాలీవుడ్ లో తొలి అడుగు వేయబోతున్నాడు అంటున్నారు. అభయ్ రామ్ కూడా "శాకుంతలం"తోనే తన మూవీ కెరీర్ ప్రారంభించబోతున్నాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. మరోవైపు మంచు ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ, దగ్గుబాటి ఫామిలీల నుంచి వారసుల హవా నడుస్తోంది. ఇప్పటికైతే టాలెంట్ ఉన్న నటీనటులు కొంతమంది ఇండస్ట్రీలో ఎలాగోలా నిలదొక్కుకుంటున్నారు. కానీ రానురానూ పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి మరి.      

మరింత సమాచారం తెలుసుకోండి: