సరైన విలన్ ఉంటేనే ఏ హీరోకైనా స్టార్ ఇమేజ్ వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాలలో  హీరో కి తగ్గట్టు విలన్ లేకపోతే..పప్పులో ఉప్పు లేనట్టే. విలన్ ఎంత బాగా పర్ఫామెన్స్ చేస్తే, హీరో అంత హైలెట్ అవుతాడు. క్రూరంగా చంపడం, పగ , ద్వేషం , బాగా హింసించడం ఇలాంటివి మన టాలీవుడ్ లో విలన్ లు ఎంత బాగా చేస్తారో బాగా తెలుసు. అయితే ఇంత క్రూరంగా హింసించే, ఈ విలన్ ల భార్యలు ఎంత అందంగా ఉంటారో అని తెలుసుకోవడానికి చాలామంది కుతూహలంగా ఉంటారు. అయితే ఈ స్టార్ విలన్ ల భార్యలు కూడా టాప్ హీరోయిన్ లని చాలా మందికి తెలియదు. అయితే వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రఘువరన్ - రోహిణి :
సినీ ఇండస్ట్రీలో రఘువరన్ కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసినప్పటికీ విలన్ గానే మంచి గుర్తింపు పొందాడు. 1982వ సంవత్సరంలో తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా తెరంగేట్రం చేసిన ఈయన మలయాళం, తమిళ భాషా చిత్రాలలో కూడా నటించి, ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. ఇక ఈయన భార్య విషయానికొస్తే, ఆమె ఎవరో కాదు ప్రముఖ రైటర్ గా , దర్శకురాలిగా, లిరిసిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన రోహిణి. దాదాపు 70 చిత్రాలకుపైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2. అవినాష్ - మాళవిక :
అప్పట్లో విలన్ గా  అదరగొట్టి, ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నాడు. కన్నడ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు, తెలుగు చిత్రాలలో కూడా నటించాడు. కేవలం 20 సంవత్సరాలలో దాదాపు 16 వందల సినిమాలకు పైగా నటించి, రికార్డు సృష్టించిన నటుడు. ఇక ఈయన భార్య మాళవిక. ఈమె కన్నడ టాప్ హీరోయిన్. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ ప్రస్తుతం బుల్లితెరపై సెటిల్ అయింది.

3. మురళి శర్మ  - అశ్విని :
విలన్ గా మంచి పేరు పొందిన మురళీశర్మ , ఇక ఈయన భార్య అశ్విని కూడా బుల్లితెరపై టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.


4. ఆశిష్ విద్యార్థి - రాజోషి విద్యార్థి :
విలన్ పాత్రలకు ఆశిష్ విద్యార్థి టాలీవుడ్ లో బాగా ఫేమస్. వందేమాతరం సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. విలన్ పాత్రలకు పెట్టింది పేరు ఈయన.అంతేకాదు నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నారు. తెలుగు ,తమిళ ,కన్నడ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన భార్య రాజోషి విద్యార్థి. చూడడానికి హీరోయిన్ వలె కనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: