అక్కినేని వారి కోడలు సమంత ప్రస్తుతం రొటీన్ సినిమాల కంటే రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాల‌లోనే నటిస్తుంది. ముఖ్యంగా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండే సినిమాల్లోనే సమంత నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే సమంత నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. దుష్యంతుడు... శకుంతల ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో శకుంతల పాత్రలో స‌మంత నటిస్తుండగా గుణశేఖర్ పాత్రలో మలయాళ నటుడు మోహన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఇటీవల వచ్చిన క‌రోనా సెకండ్ వేవ్ తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ప్రస్తుతం కరోనా త‌గ్గుముకం  ప‌ట్టిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. 

సినిమా కోసం సమంత ముందు నుండి ఎంతో కష్టపడి దాదాపు నాలుగు నెలల పాటు ఆ క్లాసిక‌ల్ డ్యాన్సులు కూడా నేర్చుకుంది. ఇక గతకొద్దికాలంగా ఈ సినిమాలో శాకుంతలం కొడుకు భరత్ పాత్రకోసం జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కుమారులలో ఒకరిని లేదా అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ను తీసుకుంటారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ నటిస్తుందని ప్రకటించేశారు. దీనిపై అల్లు అర్జున్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తాను సమంతతో సుదీర్ఘ ప్రయాణం చేశా అని ఇప్పుడు సమంతతో తన కూతురు నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

శాకుంత‌లం టీమ్ కు అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు. కాగా తాజాగా సమంత కూడా అల్లు అర్హ శాకుంతలం సినిమాలో నటించడం పై స్పందించింది. అంతే కాకుండా అర్హ పై సమంత ప్రశంసలు కురిపించింది. ఫస్ట్ టేక్ లోనే  అర్హ అన్ని డైలాగులను చకచకా చెప్పేస్తుంద‌ని పేర్కొంది. ఆమె డైలాగులు సినిమాలో సూపర్ గా ఉండబోతున్నాయి అంటూ పేర్కొంది. ఇక స‌మంత పోస్ట్ పై  అల్లుఅర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కూడా స్పందించింది. అర్హ‌కు సపోర్ట్ చేస్తున్నందుకు స‌మంత‌కు స్నేహారెడ్డి థాంక్స్ చెప్పింది. దాంతో హ‌గ్స్ ఇస్తున్న‌ట్టు స‌మంత ఓ స్టిక్క‌ర్ ను పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: