అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత నటిస్తున్న "శాకుంతలం" సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతోంది. ఈ చిన్నారి ప్రిన్స్ భారత అనే పాత్ర పోషించనుంది. గురువారం రోజు సినిమా సెట్స్ లో జాయిన్ అయిన అర్హ పది రోజుల వ్యవధిలో తనకు సంబంధించిన పోర్షన్ పూర్తి చేయనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు కానీ తన కూతురికి కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడో దూరంగా పుష్ప సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతున్నారు.

ఆయన తనకోసమని ఎంతో ఇష్టంతో కొనుగోలు చేసిన వానిటీ వ్యాన్ 'ఫాల్కన్' ని అర్హ కి ఇచ్చేశారట. అన్ని సౌకర్యాలు గల ఈ విలాసవంతమైన వ్యాన్ ని అర్హ పది రోజుల పాటు వాడుకొనున్నారని తెలుస్తోంది. బన్నీ తన ఫాల్కన్ కారవ్యాన్ తో పాటు తన వ్యక్తిగత బాడీగార్డ్స్ ని పంపించారట. దీంతో అర్హ బయట అడుగుపెట్టగానే నిత్యం బాడీగార్డ్స్ సంరక్షిస్తున్నారని.. ఈ ప్రొటెక్షన్ చూసి సినీ బృందం షాక్ అవుతుందని సమాచారం.

అంతేకాకుండా, మొట్టమొదటి షూటింగ్ రోజు బన్నీ తన సతీమణి స్నేహ రెడ్డిని సైతం సినిమా సెట్స్ కి పంపించారని.. దీంతో అర్హ కి ఏ లోటు రాకుండా ఆమె చూసుకున్నారని తెలిసింది. ఫస్ట్ రోజు మాత్రమే కాదు అర్హ చిత్రీకరణ పూర్తి చేసేంతవరకు తల్లి స్నేహ షూటింగ్ లొకేషన్ కి వస్తారట. ఆసక్తికర విషయం ఏమిటంటే.. అల్లు అర్హ ఫస్ట్ రోజు షూటింగ్ సమయంలో చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యిందట. యాక్టింగ్ చేయడం, డైలాగులు చెప్పడం వంటివి అర్హ అవలీలగా చేసిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మూవీ యూనిట్ చాలా మేకప్ వేసినప్పటికీ.. అర్హ ఎటువంటి ఇబ్బంది పడలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిన్నారి అల్లు అభిమానులను అలరించడానికి చాలా వీడియోస్ చేసి సోషల్ మాధ్యమాల్లో అప్లోడ్ చేసింది. బహుశా ఆ అనుభవమే అర్హ కి ఇప్పుడు ఉపయోగపడుతుందేమోనని తెలుస్తోంది.

ఇకపోతే శాకుంతలం చిత్రబృందం కూడా అర్హ ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా చూసుకుంటున్నారు. దీంతో బన్నీ తనయ ఆడుతూ పాడుతూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. నిహారిక తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రెండవ అమ్మాయిగా అర్హ నిలుస్తోంది. నిహారిక ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు కానీ అర్హ ప్రేక్షక ఆదరాభిమానాలను చూరగొంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: