లేడీ సూపర్ స్టార్ నయనతార దశాబ్దకాలంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతోంది. దాదాపు ఇక్కడ ఉన్న అందరు స్టార్ హీరోలతోనూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసేసింది. గ్లామర్, లవ్, లేడీ ఓరియెంటెడ్, హారర్, భక్తి... దాదాపు అన్ని రకాల కంటెంట్ ఉన్న కథల్లోనూ నటించేసింది. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా అవతరించింది. ప్రస్తుతం నయన్ నేత్రికన్, అన్నాత్తే, కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ చిత్రాల్లో, గోపిచంద్ సరసన 'ఆరడుగుల బుల్లెట్' అనే తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. మరోవైపు నయన్ డిజిటల్ ఎంట్రీ గురించి కూడా పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజాగా ఆమె ఓ పాపులర్ వెబ్ సిరీస్ లో నటించబోతోందని, అది కూడా వేరే హీరోయిన్ వదిలేసిన పాత్రలో కన్పించబోతోందని ప్రచారం జరుగుతోంది.

నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న "బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్" అనే వెబ్ సిరీస్‌లో నయన్ కనిపించనుందట. ఇంతకుముందే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ 'శివగామి' పాత్రలో నటించారు. అయితే వచ్చిన అవుట్ పుట్ పై మేకర్స్ అసంతృప్తి వ్యక్తం చేయగా, మళ్లీ దీన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నారట. కానీ హీరోయిన్ మాత్రం నిర్మొహమాటంగా తనకు కుదరదు అని చెప్పేసిందట. అందుకే మొత్తం కొత్త టీంను తీసుకుని మరోమారు 'బాహుబలి' ప్రీక్వెల్ ను తెరకెక్కించే పనిలో పడ్డారు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా ఈ సిరీస్ లో నయన్... మృణాల్ వదిలేసిన శివగామి పాత్రలో నటించడం లేదు. ఓ కీలక పాత్రను పోషిస్తోందని సమాచారం. ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యిందట. బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి శివగామి పాత్ర పోషిస్తుంది. సెప్టెంబర్ నుండి ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ లో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: