గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న  సినిమా శాకుంతలం. ఈ సినిమా లో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం అందరికి తెలిసిందే.  ప్రిన్స్ భరత గా ఈ సినిమా లో అల్లు అర్జున్ కూతురు ఆర్హ కనిపించబోతుండడం విశేషం.  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం.  ఈ పాప కు ఈ పాత్ర ఎంతో స్పెషల్ గా నిలుస్తుంది అని అంటున్నారు. 

అలా ఇప్పుడు స్టార్ హీరోయిన్ లుగా, హీరో లుగా ఉన్న చాలామంది బాలనటులుగా ఎంట్రీ ఇచ్చి తమ కెరీర్ను ప్రారంభించి స్టార్ లు అయ్యారు.  ఆ విధంగా పౌరాణిక పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసుకున్న వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.  ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ రూపొందించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటుడిగా నటించారు ఎన్టీఆర్. అలా తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. 

ఆ తర్వాత బాలరామాయణంలో రాముడు గా నటించి అందరినీ మెప్పించారు. అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి యశోద కృష్ణ సినిమా లో శ్రీ కృష్ణుడి వేషం వేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. నిజంగా ఆమె చూసిన ప్రతి ఒక్కరూ తాను అమ్మాయి అంటే నమ్మలేదు ఎవరు ఆ టైంలో. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా ఈ స్థాయికి వెళ్ళిందో అందరికీ తెలిసిందే. ఇక సీనియర్ నటి రోజా రమణి సైతం తన తొలి చిత్రం భక్త ప్రహ్లాద లో ప్రహ్లాద పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె కొడుకు తరుణ్ కూడా బాలనటుడిగా చేసి హీరోగా ఎదిగాడు. భక్త ప్రహ్లాద సినిమా లో ఎస్.వి.రంగారావు తో కలిసి పోటాపోటీగా నటించింది రోజారమణి. 

మరింత సమాచారం తెలుసుకోండి: