సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వ సాధారణమైపోయింది. ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది. బాలీవుడ్ లో అయితే మరీ ఎక్కువ. టాలీవుడ్ లోనూ వారసుల ఎంట్రీపై నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇండస్ట్రీని నాలుగు ఫ్యామిలీలే ఉన్నాయని విమర్శకుల అభిప్రాయం. ఇప్పటికే పలువురు స్టార్స్ ఫ్యామిలీల నుంచి చాలా మంది వారసుల ఎంట్రీ జరిగింది. వాళ్ళలో కొంతమంది చలన చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోగా, మరికొంతమంది మాత్రం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నాలుగో తరం స్టార్ కిడ్ గా అల్లు అర్హ ఎంట్రీ చర్చనీయాంశమైంది. దీంతో నాలుగో తరం చిన్నారులు ఎవరెవరు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనే విషయమై నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ ఎంట్రీకి సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో మరో ఏడుగురు స్టార్ కిడ్స్ వెండితెర అరంగ్రేటం చేస్తే బాగుంటుందని వారి అభిమానులు కోరుకుంటున్నారు.

ఆ జాబితాలో సితార ముందు వరుసలో ఉంది. మహేష్ బాబు, నమ్రత ల ముద్దుల కూతురు సితార చాలా క్యూట్ గా ఉంటుంది. నమ్రత అప్పుడప్పుడు వారికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆమెకు ఇప్పటి నుంచే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నెక్స్ట్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్. మన ఐకాన్ స్టార్ కొడుకు అల్లు అయాన్ కూడా ముద్దుగా ఉంటాడు. ఆయన ఎంట్రీ గురించి అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఆయన కొడుకు అకిరా నందన్ కు సంబంధించి తరచుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి.


అకీరా సినిమాల్లోకి రావాలనుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని రేణు దేశాయ్ ఎప్పుడో చెప్పేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్. భార్గవ్ రామ్ చిన్నపిల్లాడే అయినా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అతన్ని వెండి తెరపై చూడాలని కోరుకుంటున్నారు. సీనియర్ హీరో వెంకటేష్ కొడుకు అర్జున్ దగ్గుపాటి. వెంకటేష్ ఫ్యామిలీ అసలు బయట ఎక్కడా కనిపించదు. ఏదైనా వేడుక అయితే తప్ప. రానా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ వెంకీ కొడుకు కూడా ఎంట్రీ ఇస్తే బాగుండునని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇంకా నాని కొడుకు అర్జున్, రవితేజ కొడుకు, నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా వారి వారి ఫ్యాన్స్ ఆతృతగా వెయిటింగ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: