బాలయ్య టాలీవుడ్ లో సీనియర్ హీరో. ఆయన బ్లాక్ అండ్ వైట్ మూవీస్ నుంచి కూడా సినిమా పరిశ్రమలో ఉన్నారు. ఆయనది దాదాపుగా అయిదు దశాబ్దాల అనుభవం. సుదీర్ఘమైన కెరీర్ ఆయన సొంతం. బాలయ్య ఆనాటి మేటి దర్శకులతో నటించారు.

ఇపుడు వస్తున్న కొత్త డైరెక్టర్ల సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నారు. దర్శకుల హీరోగా ముద్రపడిన బాలయ్య ఎపుడూ వివాదాలలో  లేరు. ఆయన మనసు వెన్న అని కూడా చాలా మంది చెబుతారు. దగ్గరగా వెళ్లిన వారికి బాలయ్య అంటే ఎంతో ఇష్టం. ఆయనతో స్నేహాన్ని వదులుకోరు. చిత్రమేంటి అంటే బాలయ్య లెజండరీ స్టార్ ఎన్టీయార్ వారసుడిగా ఇండస్ట్రీలో ఎపుడూ పెత్తనం చేయాలనుకోలేదు. అంతే కాదు ఆయన హడావుడి  కూడా చేయలేదు.

అయితే టాలీవుడ్ తీరుతెన్నుల పట్ల ఆయన తన సన్నిహితులతో ముచ్చటించడం తప్ప అందరితో కూర్చుని మాట్లాడింది లేదు. ఆయన భావాలు అన్నీ కూడా మీడియా ముఖంగానే జనాలతో పాటు టాలీవుడ్ జనాలు తెలుసుకోవాల్సిందే. ఇదిలా ఉంటే బాలయ్య స్కూల్ పాతది అన్నది తెలిసిందే. ఆయన మొదట్లో  ఏడాదికి ఏడెనిమిది సినిమాలు కూడా చేసిన సంగతి విధితమే.

ఇపుడు చూస్తే ట్రెండ్ దానికి విరుద్ధం. ఒక హీరో ఏడాదికి కరెక్ట్ గా ఒక సినిమా రిలీజ్ చేస్తే అదే పెద్ద గొప్పగా ఉంటోంది. దీని వల్ల ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోంది. థియేటర్లకు  ఫీడింగ్ ఉండడం లేదు. సినీ కార్మికులకు కూడా ఉపాధి దక్కడంలేదు. దీంతో బాలయ్య మంచి మాట చెబుతున్నారు. ప్రతీ హీరో కచ్చితంగా ఏడాదికి మూడు సినిమాలు చేయాలి. అపుడే ఇండస్ట్రీ పచ్చగా కళకళలాడుతుంది అని అంటున్నారు. బాలయ్య మాట బంగారు మూటే అని సినీ పెద్దలు కూడా చెబుతున్నారు. కానీ పాన్ ఇండియా మోజులో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది సాధ్యపడుతుందా అంటే చూడాలి మరి ఏం జరుగుతుందో.




మరింత సమాచారం తెలుసుకోండి: