పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది నభానటేష్. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా లో అటు ఎనర్జిటిక్ స్టార్ రామ్ లవర్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదటి సినిమాతోనే  తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు తన అందాల ఆరబోతతో అందరిని మంత్రముగ్దుల్ని చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.  చేసిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ అమ్మడి కెరియర్కి ఎంతగానో ప్లస్ అయింది.



 దీంతో ఇక ఈ అమ్మడు చెంతకు వచ్చి వరుస అవకాశాలు వాలి పోతున్నాయి. అయితే కేవలం సినిమాలలోనే కాదు అటు వాణిజ్య ప్రకటనల్లో కూడా మెరుస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది నభానటేష్. ఇకపోతే ఈ ఇష్మార్ట్ భామ కు ప్రస్తుతం మరో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి.  అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇక ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభ నటేష్ కన్ఫర్మ్ అవుతుంది అని ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. ఇక యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నవ నటేష్  పాత్ర కూడా ఎంతో కొత్తగా ఉండబోతుంది అన్న టాక్ ప్రస్తుతం అభిమానులలో ఆత్రుత ను పెంచుతుంది.




 అయితే మొదట దర్శకుడు ఈ సినిమా కథను నభానటేష్ కు వినిపించగా కథ నచ్చడంతో ఈ అమ్మడు వెంటనే ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.  ఇలా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది నభ నటేష్ .  వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేక పోతుంది ఈ ముద్దుగుమ్మ  .  అయితే గోపీచంద్ సినిమా అయినా నభానటేష్ కు మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందా లేదా అన్నది వేచిచూడాలి మరి. ఇక మరోవైపు ఇక ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో రెండో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ కూడా వరుస అవకాశాలతో దూసుకు పోతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: