ప్రస్తుతం దేశంలో టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా గురించి వస్తున్న వార్తలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవలే విడుదల చేసిన రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఈ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం ముగింపు దశకు వచ్చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ అనేది జరుగుతోంది. ఇక ఇటీవల ఈ ప్రమోషన్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషనల్ సాంగ్ ను ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా తెరకెక్కించలేని విధంగా ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ షూట్ చేస్తున్నారని ఇంకా భారీ ఖర్చుతో పాటు అత్యంత ఖరీదైన సెట్టింగ్ లో తెరకెక్కిస్తున్నారని గట్టి సమాచారం అందుతుంది.ఇక అంతేగాక ఈ ప్రొమోషనల్ సాంగ్ లో రాజమౌళి సినిమాలలో నటించిన హీరో హీరోయిన్లు కనిపించబోతున్నారని సమాచారం అందుతుంది.

ఇక ప్రమోషనల్ సాంగ్ లో కొన్ని సెకన్ల పాటు రెబల్ స్టార్ ప్రభాస్..టాలీవుడ్ స్వీట్ హీరోయిన్ అనుష్క.. ఇంకా రానా  హీరో రవితేజ.. హీరో నితిన్ ఇంకా కొందరు హీరోలు హీరోయిన్స్ కూడా కనిపించబోతున్నట్లుగా పుకార్లు పుట్టుకు వచ్చాయి. కాని తాజాగా ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ నుండి వచ్చిన అధికారిక క్లారిటీ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్స్ లో వేరే స్టార్స్ ఎవ్వరు కనిపించరు అట. ఇక కేవలం ఈ సినిమా లో నటించిన వారు పని చేసిన వారు మాత్రమే కనిపిస్తారంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.కాని అనుష్క, ప్రభాస్ ఓ గెస్ట్ రోల్స్ లో నటిస్తారని రూమర్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన సన్నివేశంలో వీరిద్దరూ కనిపిస్తారాని ప్రచారం బాగా జోరుగా సాగుతుంది. అయితే అలాంటిది ఏమి లేదని ఇందులో వేరే స్టార్స్ ఎవ్వరూ నటించట్లేదని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఇక అక్టోబర్ 13 న ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: