టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్ లు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. తెర వెనుక ఎన్ని కష్టాలు ఉన్నా కూడా దిగమింగుకుని తెలుగుతెరపై నవ్వుల పువ్వులు పూయించి తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ఒక అధ్యాయాన్ని తొలగించుకున్నారు ఎంతోమంది హాస్యనటులు. అలా తెలుగు వారిని నవ్విస్తూ ఏడిపిస్తూ ఆహ్లాదపరుస్తూ అందరి మనసులో నిలిచిపోయిన నటుడు రాళ్ళపల్లి నరసింహారావు. ఈయన సీన్ వస్తే చాలు తెలుగు ప్రేక్షకులు కడుపుబ్బా మొదలు పెడతారు.

అంతేకాకుండా సెంటిమెంటల్ గా కూడా ఎంతో ఏడిపిస్తారు. కమెడియన్ గా,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ నటుడు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ రెండేళ్లక్రితం స్వర్గస్తులయ్యారు. అప్పట్లో ప్రతి సినిమాలో రాళ్ళపల్లి కోసం ఒక ప్రత్యేక పాత్రను రాసేవారు దర్శకులు రచయితలు. ఆయన సినిమా జీవితం గురించి అందరికీ తెరిచిన పుస్తకమే అయి నా ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద అబ్బాయి రష్యాలో డాక్టర్ కోర్సు చేయడానికి వెళుతూ మార్గమధ్యలో చనిపోయింది. 

ఆమె పేరు మాధురి. నలుగురి ఆరోగ్యాన్ని బాగు చేసే వైద్యురాలు గా పేరు తెచ్చుకుని తండ్రికి మంచి పేరు తీసుకురావాలని రష్యాలో మెడిసిన్ చదవడానికి బయలుదేరింది. ఆ విధంగా ట్రైన్లో వెళ్తున్న ఆమెకు వైరల్ ఫీవర్ లాంటిది సోకి సకాలంలో వైద్యం అందక ట్రైన్లోనే ప్రాణాలు కోల్పోవడం ఆయనను ఎంతగానో బాధించింది. ఆమె భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి చెన్నై కి రప్పించడానికి అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఎంతో సాయం చేశారట. మాధురి ఆకస్మిక మృతినీ రాళ్ళపల్లి తట్టుకోలేకపోయాడు. కూతుల్లంటే అమితమైన ప్రేమ కావడంతో పెద్దమ్మాయి పోయినా దుఃఖంను దిగమింగుకుని ఆయన తెలుగు తెరపై నవ్వులు పూయించారు. ఆయన మాధురి అనే పేరు ని తన ప్రతి చొక్కా పై కుట్టించుకునే వారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: