తెలుగు సినిమా రంగంలో తెలుగు గడ్డపై పుట్టిన వారు హీరోయిన్లుగా రాణించడం తక్కువ. తెలుగు గడ్డపై పుట్టిన ఆడపడుచులకు ఎన్నో పరిమితులు ఉంటాయి... వారు ఎంతో సాంప్రదాయ బద్ధంగా ఉండాలి.. ఎన్నో కట్టుబాట్లకు పరిమితం కావాలి. ఇవన్నీ దాటుకుని సినిమా రంగంలో రాణించాలంటే మామూలు విషయం కాదు. అయితే అదే తెలుగు గడ్డపై పుట్టి బాలనటిగా , హీరోయిన్ గా, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో పాత్రలలో నటించి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఈ రికార్డు సీనియర్ యాక్టర్ రోహిణి కి మాత్రమే దక్కింది. రోహిణి అచ్చతెలుగు.. అసలు సిసలు సాంప్రదాయమైన తెలుగు అమ్మాయి. విశాఖ జిల్లాలోని అనకాపల్లి లో పుట్టిన రోహిణి సినిమారంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. రోహిణి తండ్రి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు.

తండ్రి ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె చెన్నై వెళ్లారు. బాలనటిగా ఎస్వీఆర్ - సావిత్రి - ఎన్టీఆర్ పక్కన ఎన్నో సినిమాల్లో నటించారు. బాల‌న‌టిగా 150కు పైగా సినిమాలు చేసిన ఘనత రోహిణి కి మాత్రమే దక్కింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారిన ఆమె తెలుగు , తమిళ , కన్నడ, మలయాళంలో 80కి పైగా సినిమాల్లో నటించారు. రోహిణి తన కెరీర్లో మొత్తం 350 సినిమాల్లో ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. ఆ సమయంలో లో సౌత్ ఇండియాలోనే విలన్ పాత్రలు పోషించడం లో తనకంటూ స‌ప‌రేట్‌ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రఘువరన్ తో ఆమె ప్రేమలో పడ్డారు.

కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్న అనంతరం ఈ జంట 1996లో వివాహం చేసుకున్నారు. రఘువరన్ - రోహిణి దంపతులకు రిషివ‌ర‌న్‌ అనే బాబు జన్మించాడు. అయితే ఆ తర్వాత రఘువరన్ విపరీతమైన తాగుడుకు బానిస కావడంతో రోహిణి ఆయ‌న నుంచి 2004లో విడిపోయారు. ఆ తర్వాత రఘువరన్ అనారోగ్యంతో మృతి చెందినా రోహిణి మాత్రం తన భర్త పై ఉన్న గౌరవం తో మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం కుమారుడు రిషివ‌ర‌న్‌ అమెరికాలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: