రాజమౌళి డైరక్షన్ లో సినిమా అంటే ఆ సినిమా రేంజ్ తారాస్థాయికి చేరుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ కూడా భారీ అంచనాలతో రాబోతుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ మూవీలో ఇద్దరు సూపర్ స్టార్స్ తమ నట విశ్వరూపంతో అలరించడం పక్కా అని తెలుస్తుంది. ఇక ఈ మూవీ నుండి మొదటి సాంగ్.. అది ప్రమోషనల్ సాంగ్ తో పాటుగా థీం సాంగ్ గా దోస్తీ సాంగ్ వదిలారు. ఈ సాంగ్ చూస్తుంటే మూవీలో ఈ పాట ఎలా ఉంటుందో అన్న రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ట్రిపుల్ ఆర్ దోస్తీ సాంగ్ చివర్లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు తమ స్పెషల్ ఎట్రాక్షన్ తో అదుర్స్ అనిపించారు. సాంగ్ లో సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీలో స్టార్ మ్యూజిక్ డైరక్టర్, సింగర్ అయిన అమిత్ త్రివేది కూడా కనిపించాడు. ఇదిలాఉంటే దోస్తీ సాంగ్ తోనే కాదు ఈ పాట తర్వాత షేక్ హ్యాండ్ కు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. మాములుగా షేక్ హ్యాండ్ అంటే రెండు చేతులు కలిపి తీసుకుంటారు. కాని దోస్తీ సాంగ్ చూశాక ఆ ట్రెండ్ మారేలా ఉంది. అదెలా అంటే ఇక మీదట దోస్తీలందరు చరణ్, ఎన్.టి.ఆర్ పట్టుకున్నట్టుగానే చెయ్యి చెయ్యి పట్టుకునే అవకాశం ఉంది.

తన మూవీస్ తో ట్రెండ్ సృష్టించడం జక్కన్నకు కామనే. ఈ దోస్తీ సాంగ్ తో షేక్ హ్యాండ్ కు కొత్త అర్ధం చెప్పేలా.. కొత్త మార్గం చూపించేశాడు. ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు స్టార్స్ ఈ షేక్ హ్యాండ్స్ కు మూవీలో ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు. అప్పటివరకు విరోధులుగా ఉన్న వారు మిత్రులుగా మారిన తర్వాత మూవీ రేంజ్ వేరే లెవల్ లో ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఆ హ్యాండ్స్ కు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు జక్కన్న.


మరింత సమాచారం తెలుసుకోండి: