యువ హీరో నాగ శౌర్య తను చేస్తున్న సినిమాల విషయంలో ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటాడు. ప్రస్తుతం నాగ శౌర్య కెరియర్ లో 20వ మూవీగా క్రేజీగా వస్తుంది లక్ష్య. సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న విషయం తెలిసిందే. మూవీలో యువ హీరో నాగ శౌర్యకి జోడీగా కెతిక శర్మ నటిస్తుంది. అయితే ఈ మూవీ స్క్రిప్ట్ కు సంబందించి నాగ శౌర్య కూడా కొంత సపోర్ట్ ఇచ్చాడట. అదే ఇప్పుడు హీరో, డైరక్టర్ మధ్య గొడవకు దారి తీసిందని ఇండస్ట్రీ టాక్.

నాగ శౌర్య ఇస్తున్న కొన్ని ఇంపుట్స్ తీసుకుని స్క్రిప్ట్ లో కొద్దిపాటి మార్పులు చేశాడట నాగ శౌర్య ఈ క్రమంలో తనకు టైటిల్ క్రెడిట్స్ కావాలని డిమాండ్ చేస్తున్నాడట నాగ శౌర్య. అయితే అందుకు డైరక్టర్ ఒప్పుకోవట్లేదని తెలుస్తుంది. ఏదో హీరో తన సినిమాకు కొన్ని ఇంపుట్స్ ఇస్తున్నాడనే ఉద్దేశంతో డైరక్టర్ విన్నాడే తప్ప కావాలని కాదని డైరక్షన్ వర్షన్. అయితే హీరో నాగ శౌర్య మాత్రం తన సలహాలు తీసుకున్నాడు కాబట్టి టైటిల్ క్రెడిట్స్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాడట.

ఈ క్రమంలో డైరక్టర్ అలిగినట్టు కూడా చెప్పుకుంటున్నారు. టైటిల్ క్రెడిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మూవీ హిట్ అయితే నాగ శౌర్యకే క్రేజ్ వస్తుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా శౌర్య వెనక్కి తగ్గితే బెటర్ అని అంటున్నారు విషయం తెలిసినవాళ్లు. ఏది ఏమైనా నాగ శౌర్య సినిమా అంటే ఏదో ఒక విషయం జరగాల్సిందే అన్నట్టుగా టాక్ వస్తుంది. ఈ మూవీతో పాటుగా నాగ శౌర్య తన సొంత బ్యానర్ లో మరో మూవీ చేస్తున్నారు. ఆ మూవీకి కూడా కథ తానే అందిస్తున్నారని తెలుస్తుంది. నాగ శౌర్యలో ఈ రైటింగ్ టాలెంట్ అలరిస్తున్నా అది డైరక్టర్స్ కు ఇబ్బందిగా మారుతుందని చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: