బిగ్ బాస్ సీజన్ 5 త్వరలో మొదలు కాబోతుందని లేటెస్ట్ గా లోగోతో ఎనౌన్స్ చేశారు. ఈ సీజన్ కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తారని చెప్పుకుంటున్నారు. ఈ వారంలో హోస్ట్ ఇంకా మిగతా డీటైల్స్ తెలుస్తాయని అంటున్నారు. ఇక ఈ షోలో కంటెస్టంట్స్ లిస్ట్ లో ఇప్పటికే చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. యాంకర్ రవి, టిక్ టాక్ దుర్గారావు, సీరియల్ యాక్ట్రెస్ సిరి హన్మంత్, నవ్య స్వామి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ కూడా పాల్గొంటున్నాడని తెలుస్తుంది.

ఇదిలాఉంటే లేటెస్ట్ గా స్టార్ మా యాంకర్ వర్షిణి కూడా బిగ్ బాస్ కు వస్తుందని చెబుతున్నారు. ముందునుండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో వర్షిణి ఉంటుందని చెబుతుండగా లేటెస్ట్ గా ఆమె చేస్తున్న ఒక షోలో మిస్ అవడం ఆమె బిగ్ బాస్ కోసమే ఈ షోలో కనిపించలేదంటూ వార్తలు వస్తున్నాయి. ఆదివారం స్టార్ మాలో వచ్చే కామెడీ స్టార్స్ కు యాంకర్ గా అలరిస్తుంది వర్షిణి. ఈ షోలో అమ్మడు తన గ్లామర్ కూడా యాడ్ చేసి ఆకట్టుకుంటుంది. అయితే లేటెస్ట్ ఎపిసోడ్ లో యంకర్ గా వర్షిణి ప్లేస్ లో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. శ్రీముఖి ఇంట్రడక్షన్.. ఆమె కామెంట్స్ చూస్తే వర్షిణి ఇప్పుడప్పుడే కామెడీ స్టార్స్ కు రాదని ఫిక్స్ అవుతున్నారు.

కామెడీ స్టార్స్ కు డుమ్మా కొట్టింది అంటే బిగ్ బాస్ కు ఆమె కన్ ఫర్మ్ అని అంటున్నారు. కరోనా నిబంధనల ప్రకారం హౌజ్ మేట్స్ అందరిని ముందే క్వారంటైన్ లో ఉంచుతారు. ఆ తర్వాత హౌజ్ లోకి పంపిస్తారు. మరి బిగ్ బాస్ సీజన్ 5లో వర్షిణి ఉంటుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. బిగ్ బాస్ తో పాటుగా గునశేఖర్ డైరక్షన్ లో వస్తున్న శాకుంతలం.. సుమంత్ మూవీస్ లో కూడా వర్షిణి నటిస్తుందని తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: