బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టంట్స్ గా వీళ్లు కన్ ఫర్మ్ అంటూ రోజుకొక కొత్త లిస్ట్ బయటకు వస్తుంది. షో స్టార్ట్ అయ్యే వరకు ఇలాంటి లిస్టులు వస్తూనే ఉంటాయి. అయితే అఫీషియల్ గా కొంతమంది పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో హౌజ్ మేట్స్ గా ఈసారి ఎక్కువగా స్మాల్ స్క్రీన్ నుండి కంటెస్టంట్స్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. బుల్లితెర మీద ఉన్న వారి క్రేజ్ బిగ్ బాస్ హౌజ్ లో ఉపయోగపడుతుందని యాంకర్లు, సీరియల్ యాక్టర్ల మీద దృష్టి పెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు.

ఇక ఇదిలాఉంటే యూట్యూబ్ హీరో.. ఓ చిన్న సినిమా హీరోకి ఉన్న ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ కూడా బిగ్ బాస్ సీజన్ 5 లో హౌజ్ మేట్ గా వెళ్తున్నాడని అంటున్నారు. అయితే తనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా షణ్ముఖ్ భారీగా డిమాండ్ చేస్తున్నాడని టాక్. రోజుకి లక్ష దాకా ఇస్తేనే తాను బిగ్ బాస్ హౌజ్ కి వస్తానని అంటున్నాడట. యూట్యూబ్ వెబ్ సీరీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్ తాను ఏ వెబ్ సీరీస్ చేసినా సరే మిలియన్ వ్యూస్ రాబడుతున్నాడు. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ 5 ఛాన్స్ కూడా అందుకున్నాడని తెలుస్తుంది.

అంతకుముందు తనకు ఆన్ స్క్రీన్ పెయిర్ గా నటించిన దీప్తి సునైనా కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లింది. సీజన్ 2లో ఆమె సందడి చేసింది. ఇక ఇప్పుడు షణ్ముఖ్ కూడా బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేశాడని అంటున్నారు. మరి షణ్ముఖ్ అడిగినంత ఇస్తున్నారా లేక బేరసారాలు జరిగాయా అన్నది తెలియదు కాని బిగ్ బాస్ వల్ల షణ్ముఖ్ కు.. అతని వల్ల బిగ్ బాస్ కు క్రేజ్ రావాలని చూస్తున్నారు. ఈ సీజన్ లో టిక్ టాక్ దుర్గారావు కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పార్టిస్పేట్ చేస్తారని అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: