కోలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సపోర్టు లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి మక్కల్ సెల్వన్ గా ఎదిగాడు హీరో విజయ్ సేతుపతి. ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమలో ఉప్పెన సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. తమిళ సినిమా పరిశ్రమలో ఉన్న దాదాపు అన్ని అవార్డులను అందుకున్న ఈ నటుడు నటన విషయంలో తనకు సాటి లేరు అని ఈ అవార్డులతో రుజువు చేశాడు.

ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే 1996 సినిమా లో గోకులంలో సీత సినిమాలో చిన్న పాత్ర వేశాడు. ఆ తరువాత కూడా కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ సేతుపతి సుందర పాండ్యన్ అనే సినిమాలో విలన్ గా నటించి బెస్ట్ విలన్ గా స్టేట్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన పలు సినిమాలు తెలుగు భాషలో అవగా వాటిలో పిజ్జా సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పచింది

ఆ తర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో విడుదల కాగా ఆ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. దాంతో తెలుగులో కూడా స్టార్ హీరోలకు తగ్గ క్రేజ్ ను అందుకున్నాడు. హీరోగా చేస్తున్న సమయంలోనే ఇతర హీరోలకు విలన్ గా కూడా నటించడం లో ఈయన తన ప్రత్యేకతను చాటుకున్నాడు. విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించి తనకు హీరో విలన్ అనే తారతమ్యాలు లేవు నటించడం ఒక్కటే తెలుసు అని చెప్పాడు. తెలుగు సినిమా పరిశ్రమకు సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఉప్పెన తో హిట్ కొట్టి ఇప్పుడు కొన్ని సినిమాల్లో చేసే విధంగా ప్రణాళికలు వేసుకున్నాడు.

త్వరలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మరొక సినిమాలో కూడా ఓ కీలక పాత్రను చేయడానికి ఒప్పుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపు 20 సినిమాలు ఉన్నాయి అంటే విజయ్ సేతుపతి కెరీర్ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఏ నటుడి చేతి లో కూడా ఇన్ని సినిమాలు లేవు. నార్మల్ గా హీరోగా ఎదిగిన తర్వాత విలన్ గా, ప్రత్యేక పాత్రలో నటించడానికి హీరోలు ఎక్కువగా మొగ్గు చూపరు కానీ విజయ్ సేతుపతి దానికి భిన్నంగా ఆలోచిస్తూ తనకు పాత్ర తీరు నచ్చితే చాలు ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సేతుపతి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. మరి తమిళనాట చరిత్ర సృష్టించిన విజయ్ సేతుపతి తెలుగు నాట ఇంకెన్ని రికార్డ్స్ ఇస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: