టాలీవుడ్ లో రెండు భారీ బడ్జెట్ మూవీస్ నేషనల్ వైడ్ గా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి. అందులో మొదటిది రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ కాగా రెండొవది అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప. ఈ రెండు సినిమాల మీద తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ మూవీని అక్టోబర్ 13న రిలీజ్ అని ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు చిత్రయూనిట్. పాన్ ఇండియా మూవీగా ఆర్.ఆర్.ఆర్ తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి. ఎన్.టి.ఆర్, చరణ్ లు కలిసి చేయడం ఈ సినిమాకు మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.

ఇక అల్లు అర్జున్ పుష్ప మూవీ కూడా భారీ అంచనాలతో వస్తుంది. మొదటిసారి బన్నీ పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న ఈ మూవీని సుకుమార్ తన దైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. మూవీలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తుందని చెబుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీని ఈ ఏడాది క్రిస్ మస్ కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 13 అంటే దసరా బరిలో ఆర్.ఆర్.ఆర్.. క్రిస్ మస్ పోటీలో పుష్ప వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈమధ్యనే థియేటర్లు తెరచుకోగా రీసెంట్ గా రిలీజైన రెండు మూవీస్ కు పెద్దగా ఆదరణ లభించలేదు అన్నది టాక్.

అయితే పెద్ద మూవీస్ రిలీజ్ అయితేనే కాని ప్రేక్షకులు థియేటర్ బాట పట్టరన్న టాక్ కూడా ఉంది. ఈ క్రమంలో రిలీజ్ అవ్వాల్సిన చాలా మూవీస్ ఉన్నా కూడా ఆ మూవీస్ రిలీజ్ డేట్ ప్రకటించడంలో ఇంకా వెనుకడుగు వేస్తున్నారు. నాగ చైతయ లవ్ స్టోరీ, నాని టక్ జగదీష్, రవితేజ ఖిలాడి, బాలకృష్ణ అఖండ, చిరంజీవి ఆచార్య కూడా రిలీజ్ రేసులో ఉన్నాయి. ఈ మూవీస్ చూపించని తెగువ ఆర్.ఆర్.ఆర్, పుష్ప చూపించాయి. మరి అనుకున్న విధంగా అంతా సవ్యగా జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: