దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో సమంత అక్కినేని టైటిల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ శాకుంతలం సినిమా నుంచి ఒక ఫొటో షేర్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఆమె శాకుంతలం సినిమా కోసం మేకప్ వేసుకోవడం చూడొచ్చు. మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ సమంతకు మేకప్ వేయడం చూడొచ్చు. సదరు లేడీ సమంత పెదవి అంచున ఉన్న శరీర భాగాన్ని మేకప్ తో అందంగా రెడీ చేస్తోంది. ఈ ఫొటోలో సమంత గ్రీన్ కుర్తా ధరించి చాలా అందంగా కనిపించింది. ఆమె ఒక చైర్ లో కూర్చున్న గా వెనుక ఒక భారీ అద్దం కనిపించింది. ఆమె ముందు కూడా మరొక అర్థం ఉన్నట్లు కనిపించింది. అద్దానికి పైభాగాన అలాగే పక్కన రెండు లైట్ కనిపించాయి.
ఇది చూడ్డానికి ఒక విలాసవంతమైన ఇల్లు మాదిరి కనిపించింది. కానీ నిజానికి ఆమె కూర్చుంది తన లగ్జరీ కారవ్యాన్ లో..! ఇందులో ఒక టాప్ క్లాస్ బెడ్ కూడా కనిపించింది. దీంతో అభిమానులు సమంత వ్యానిటీ వ్యాన్ పై మనసు పరేసుకున్నారు. ఈ కారవ్యాన్ విలువ 2-3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫొటో షేర్ చేసిన సమంత కారవ్యాన్ లైఫ్ అని ఒక కాప్షన్ జోడించారు.



నిజానికి సినీ సెలబ్రెటీలు షూటింగ్ లో ఎంత సమయం గడుపుతారు దాదాపు అంతే సమయం కారవ్యాన్ లో గడుపుతుంటారు. వాష్ రూమ్, బెడ్రూమ్, కిచెన్, టైం టేబుల్ ఇలా చెప్పుకుంటూ పోతే సకల సౌకర్యాలు కారవ్యాన్ లో ఉంటాయి. అందుకే సమంత కూడా తనకంటూ ఒక కారవ్యాన్ కొనుగోలు చేశారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి టాలీవుడ్ అగ్రహీరోలు కూడా కోట్ల విలువైన కారవ్యాన్ కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచారు.



ఇకపోతే సమంత అక్కినేని నటిస్తున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ప్రిన్స్ భారత పాత్రలో నటించనుంది. అదితి బాలన్, మోహన్ బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: