నాగార్జున కోడలుగా కాకుండా సమంత అక్కినేని కుటుంబ కోడలు అయిన తరువాత కూడ తన హవా కొనసాగుతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ఘన విజయం తరువాత సమంత కు అనేక వెబ్ సిరీస్ లలో నటించమని అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది.


ఒకవైపు ‘శాకుంతలం’ లాంటి భారీ మూవీ ప్రాజెక్ట్ లో నటిస్తూనే తాను కొత్తగా ప్రారంభించబోతున్న జ్యూయలరీ బ్రాండ్ ప్రమోషన్ గురించి ఆలోచనలు చేస్తోంది. మరొకవైపు తన అభిమానులకు పెంట్ హౌస్ ఫార్మింగ్ లో మెళుకువలు తెలియచేస్తూ సోషల్ మీడియాలో నిరంతరం బిజీగా ఉంటూ తన గురించి అదేవిధంగా తన భర్త నాగచైతన్య గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేస్తూ సందడి చేస్తోంది.


ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టా గ్రామ్ లో మిలియన్స్ కొద్ది ఫాలోయర్స్ ఉన్నారు. రోజురోజుకు ఇన్ స్టా గ్రామ్ లో ఆమె అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రేజ్ తో ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పెడుతున్న అనేక పోస్టులకు లక్షలలో పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఇప్పటి వరకు ఆమె తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా తన అభిమానులను తరుచు పలకరించడమే కాకుండా కొన్ని ప్రముఖ ప్రొడక్ట్స్ ను తన అభిమానులకు పరిచయం చేస్తూ ఆ పరిచయ కార్యక్రమం ద్వారా కూడ ఆమె భారీ పారితోషికాలు తీసుకుంటోంది అని అంటున్నారు.


సాధారణంగా బాలీవుడ్ సెలెబ్రెటీలు ముఖ్యంగా అనుష్క శర్మ అలియా భట్ లు ఇలా ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ప్రొడక్ట్స్ ను తమ అభిమానులకు పరిచయం చేసి కోట్ల రూపాయలలో పారితోషికం తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ను పసిగట్టిన సమంత కూడ అదే బాటలో పయనిస్తూ తన మావయ్య నాగార్జున తన భర్త నాగచైతన్య లు కూడ చేయలేని విధంగా కొత్త మార్గాన్ని ఎంచుకుని భారీ పారితోషికాలు తీసుకుంటున్న సమంతకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: