తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో రాజశేఖర్ ఒక్కరు. ఆయన ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ హిట్ కాలేదనే విషయం అందరికి తెలిసిన సంగతే. ఇక ఆయన సక్సెస్ కోసం రూటు మార్చిన రాజశేఖర్ శ్రీవాస్ డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికి తెల్సిందే. అయితే సోలో హీరోగా సక్సెస్ కావడం కష్టమని భావించిన రాజశేఖర్ విభిన్నమైన పాత్రలను ఎంచుకుని కెరీర్ లో సక్సెస్ సాధించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. కాగా.. శ్రీవాస్ సినిమాలో హీరో పాత్రకు సమానంగా రాజశేఖర్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని పాత్ర నిడివి కూడా ఎక్కువ ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

అయితే గోపీచంద్ తండ్రి టీ కృష్ణ అంటే రాజశేఖర్ కు ఎంతో గౌరవం కావడంతో రాజశేఖర్ వెంటనే ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు శివ కార్తికేయన్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించే అవకాశం రాజశేఖర్ కు వచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్. కాగా.. దాదపు మూడు దశాబ్దాల క్రితం రాజశేఖర్ ఇతర హీరోలతో కలిసి నటించిన సంగతి అందరికి తెల్సిందే.

ఇక సీనియర్ హీరోలకు మార్కెట్ అంతకంతకూ తగ్గుతున్న నేపథ్యంలో రాజశేఖర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే రాజశేఖర్ నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆఫర్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెల్సుస్తోంది. ఇక మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్న నేపథ్యంలో రాజశేఖర్ గోపీచంద్ కాంబోపై మంచి అంచనాలు నెలకొంది. అంతేకాదు.. ఈ మధ్య కాలంలో గోపీచంద్ నటించిన సినిమాలేవీ హిట్ కాలేదని తెలుస్తోంది. అంతేకాక.. శ్రీవాస్ గోపీచంద్ కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కావడంతో గోపీచంద్ కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: