మమ్ముట్టి.. ఈ పేరు ఎక్కువగా యాత్ర సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. ఎందుకంటే దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన, ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించి , ప్రేక్షకుల ముందుకు రాజశేఖర్ రెడ్డి నిజంగా వచ్చారా..? అన్నట్టుగా నటించడం జరిగింది. ఇక దీంతో ఈయన పేరు అతి తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. మమ్ముట్టి నిజానికి మలయాళం నటుడు. ఇక ఈయన పూర్తి పేరు ముహమ్మద్ కుట్టి పనప రంబిల్ ఇస్మాయిల్. 1951 సెప్టెంబర్ 7వ తేదీన కొచ్చిన్ లో జన్మించారు.

మమ్ముట్టి మొదటిసారిగా 1987 వ సంవత్సరంలో వచ్చిన న్యూఢిల్లీ అనే చిత్రంలో నటించాడు. ఇక్కడ విజయం సాధించడంతో 1990వ సంవత్సరంలో మౌనం సమాధానం అనే సినిమా ద్వారా తమిళ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి,  1992లో వచ్చిన స్వాతికిరణం సినిమా ద్వారా తెలుగు లోకి ప్రవేశించారు. అంతే కాదు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్లో కూడా నటించడం విశేషం.. ఈయన తన నటనతో నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు.

ఇక ఈయన కుటుంబ విషయానికొస్తే ,1979 లో సల్ఫత్ ను వివాహం చేసుకున్నారు. తర్వాత వీరికి 1982వ సంవత్సరంలో సురుమి అనే కూతురు జన్మించగా, 1986 సంవత్సరంలో దుల్కర్ సల్మాన్ అనే కుమారుడు జన్మించాడు. దుల్కర్ సల్మాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు కొట్టేస్తూ, స్టార్ హీరోగా  ఎదిగే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంతేకాదు ఈయనకు నేషనల్ అవార్డులతో పాటు, కేరళ నుండి వచ్చిన ఎంతో మంది హీరోలలో మ్యాగజైన్ పై తన ఫోటోను ముద్రించడం అదే మొదటిసారి.అలా  దుల్కర్ సల్మాన్ గుర్తింపు పొందాడు. అంతేకాదు ఫోర్బ్స్ ఇండియా జాబితాలో కూడా దుల్కర్ సల్మాన్ పేరు నమోదు చేసుకోవడం గమనార్హం.

ఇకపోతే మమ్ముట్టి నటుడు మాత్రమే కాదు..నిర్మాత కూడా.. ఈయన తన 50 సంవత్సరాల సినీ జీవితంలో 400కు పైగా చిత్రాల్లో నటించి , మంచి గుర్తింపు పొందాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: