ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై యాంకర్ రష్మి కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ప్రస్తుతం బుల్లితెర పై ఉన్న హాట్ యాంకర్ లలో రష్మి కూడా ఒకరుగా కొనసాగుతున్నారు. జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా దగ్గరయింది రష్మి. ఇక ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతూ తన క్రేజ్ అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో అటు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. అయితే సినిమాలో హాట్ హాట్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ అమ్మడు.



 ఇలా సినిమాల్లో హాట్ హాట్ పాత్రలో నటించడమే కాదు సోషల్ మీడియాలో కూడా ఎన్నో ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను పగటి కలల్లోకి నెడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా కూడా పొట్టి పొట్టి బట్టల తో ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఇక ఎక్స్ ట్రా జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతున్న రష్మి అప్పుడప్పుడు స్కిట్ జరుగుతున్న సమయంలో  తనదైన శైలిలో పంచులు వేస్తూ ఉండడం చేస్తూ ఉంటుంది. ఎక్కువగా అయితే సుడిగాలి సుదీర్ స్కిట్ జరుగుతున్న సమయంలో పంచులు వేస్తూ ఉంటుంది రష్మి.



 ఇకపోతే ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడులైంది. ఈ ప్రోమోలో రష్మి 'రా' అంటూ రొమాంటిక్గా పిలిచింది. అయితే అలా రొమాంటిక్ గా పిలిచింది సుడిగాలి సుదీర్ ని కాదు..  రాకింగ్ రాకేష్ ని. ఇంతకీ ఎందుకు అలా పిలిచింది అంటారా..  రాకింగ్ రాకేష్ స్కిట్ జరుగుతున్న సమయంలో..  రోహిణి రాకింగ్ రాకేష్ ను చెంపపై కొడుతుంది.  అటునుంచి కొడితే ఇటు రావాలి అంటూ రష్మీ చెబుతుంది..  కానీ రాకింగ్ రాకేష్ మాత్రం ఒకే చోట నిలబడతాడు. ఆ సమయంలో నా దగ్గరికి రా అంటూ ఎంతో రొమాంటిక్గా పిలుస్తుంది. దీంతో రాకింగ్ రాకేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. జబర్దస్త్ జడ్జిలు పగలబడి నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: