నాచురల్ స్టార్ నాని మొట్టమొదటిసారిగా డ్యూయల్ రోల్ లో చేసినటువంటి సినిమా"కృష్ణార్జున యుద్ధం". ఈ సినిమాని దర్శకుడు మేర్లపాక గాంధీ నిర్మించాడు. కానీ ఈ సినిమా నాని వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న అప్పుడే స్పీడ్ బ్రేకర్ కు అడ్డు పడింది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి గల కారణాలు ఏంటో చూద్దాం.

"కృష్ణార్జున యుద్ధం" ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే రాబట్టిన, చివరికి డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీని తర్వాత ఈ సినిమా తీసిన డైరెక్టర్ మరే సినిమాను చేయలేదు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత "అంధాదున్"అనే ఒక రీమిక్స్ సినిమాను తీయబోతున్నాడు. ఇదే నేపథ్యంలో డైరెక్టర్ ఏమని చెప్పారంటే..

" కృష్ణార్జున యుద్ధం సినిమాను నేను 72 రోజుల్లోనే తీశాను. నేను చేసినటువంటి సినిమాలలో ఎక్కువ రోజులు సమయం తీసుకున్నది ఈ సినిమాకే, ఈ సినిమాలో నాని డ్యుయల్ పాత్రలో చేయించడం వలన అందుకు సమయం ఎక్కువ పట్టింది. హీరో నాని కూడా ఈ సినిమాను ఎంతో ఇష్టపడి, చాలా కష్టపడి చేశారు. కానీ ఇది ఆశించిన ఫలితాన్ని మా ఇద్దరికీ ఇవ్వలేదని తెలియజేశాడు.

అంతే కాకుండా ఈ సినిమా విషయంలో కొన్ని జాగ్రత్తలు మేము తీసుకోవాల్సింది. ఈ సినిమా చూసిన జనాలు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వడం చేత ఈ సినిమా ఫ్లాప్ అయిందని తెలియజేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ. కానీ ఈ మూవీ మాకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. నాని మాత్రం నాకు ఒక సోదరుడిలా అండగా నిలిచారని తెలియజేశారు. అంతేకాకుండా నానీతో ఫ్యూచర్లో మరొక సినిమా కూడా చేస్తానని.. ఆ సినిమాని కచ్చితంగా హిట్టు చేయడానికి చాలా కష్టపడతాను అని తెలియజేశారు మేర్ల పాక గాంధీ.ఇక ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమాని అతి త్వరలో మన ముందుకి విడుదల చేయనున్నారు నాచురల్ స్టార్ నాని .

మరింత సమాచారం తెలుసుకోండి: