బాలీవుడ్ లో జాక్వెలిన్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. కానీ ఈమె కేవలం సినిమాలలో చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. హీరోయిన్ గా తనకు ఎటువంటి పాత్రకైన ఓకే చెప్పేస్తుంది. ఇక అంతే కాకుండా ఈమె ఐటెం సాంగ్ లో నటించడం వల్ల ఆ సాంగ్ కి పెద్ద పాపులారిటీ కూడా వస్తుంది. అందుకే ఈమెను బాలీవుడ్ జాకీ అని అంటారు. అయితే ఈమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఈమె ఇతర దేశస్తురాలు అని అందరికీ తెలిసిందే. ఈమె శ్రీలంక ప్రాంతానికి చెందినది. కానీ తన తల్లి మాత్రం మలేషియాకు చెందినది. ఇక వాళ్ల పూర్వీకులు మాత్రం కెనడాకి చెందిన వారు కావడం విశేషం.

1). జాక్వెలిన్ ఈ మూడు దేశాలకు చెందినది. కెనడా, శ్రీలంక , మలేషియా వంటి దేశాలకు చెందినది.కానీ పెరిగినది మాత్రం.. బహ్రెయిన్ లోనట.

2). జాక్వెలిన్ కు ఒక సోదరి, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఈమె వారి ఇంట్లో అందరికన్నా చిన్నదట.

3). ఇక ఈమె స్కూల్ లో వేసే షో లలో కూడా పాల్గొనేదట. అందులో ఎన్ని సార్లు గెలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

4). ఈమె సిడ్నీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్నది. అంతేకాకుండా శ్రీలంకలో టెలివిజన్ రిపోర్టర్ గా కూడా పని చేసి, ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగు వేసింది.

5). జాక్వెలిన్ కు ఎన్నో లాంగ్వేజ్ లు వస్తాయి. ఈమెకు అరేబియన్ భాషల్లో కూడా బాగా ప్రాధాన్యత ఉండటంతో ఆమెకు అక్కడ ప్రవేశం ఉన్నది.

6). జాక్వెలిన్ కు హార్స్ రైడర్ అంటే చాలా ఇష్టం. ఆమె గుర్రంతో దిగినటువంటి ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో  పోస్ట్ పెడుతూ ఉంటుంది

7).2008,2011 వ సంవత్సరంలో  వరల్డ్ సెక్సీయెస్ట్ ఉమెన్స్ లిస్ట్ లో 12వ స్థానం గెలుచుకుంది.

8).2014 లో టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో ఈమెకు 6 వ స్థానం రావడం గమనార్హం.

అలా అన్నింటిలో మంచి ప్రావీణ్యం పొందింది.


మరింత సమాచారం తెలుసుకోండి: