టీమిండియా క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఇప్పుడు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఇక వీరిద్దరూ ఎప్పుడూ సోషల్ మీడియాకు దగ్గర లోనే ఉంటారు. టీమిండియా తరఫునా ఆడి అక్కడ నుంచి విరాట్ కోహ్లీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక అనుష్క శర్మ కూడా తమ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తమ గురించి ఎప్పుడు ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంది. ఇక వీరిరువురు ఒక షాంపూ యాడ్ తో తొలిసారిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అలా 2017 లో వీరు వివాహం చేసుకున్నారు. గత సంవత్సరం వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది.

అనుష్క డెలివరీ టైం లో విరాట్ కోహ్లీ తన పక్కనే ఉండి, ఆమెకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టేవాడు. అలా వీరికి జనవరి 11న ఒక పాప పుట్టింది. అనంతరం ఆమె 21 రోజుల తర్వాత చిన్నారి పేరు"వామిక కోహ్లీ " అని తెలిపారు. అయితే తన భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు విరాట్ కోహ్లీ. తను సంతోషంగా ఉండడానికి ముఖ్య కారణం తన భార్య అనుష్కనే అంటూ తెలియజేశాడు.

క్రికెటర్ దినేశ్ కార్తీక్ చేసిన ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ ఇలా తెలియజేశారు.. అనుష్క తన జీవితంలోకి రాకుంటే.. అసలు నేను ఎక్కడ ఉండేవాడినో నాకు తెలియదు.. అంటూ తెలియజేశారు. నేను ఈ రోజున ఇలా ఉండడానికి నా భార్య కారణమని తెలియజేశాడు. నేను ఎక్కడ ఎలా ఉంటానో తన భార్యకి మాత్రమే కేవలం తెలుసు అని తెలియజేశాడు. అంతే కాకుండా అనుష్క తన పక్కన ఉంటే చాలా రిలీఫ్ గా ఉంటుంది అన్నాడు కోహ్లీ.

ఇక ఇలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం అని తెలుపుకు వచ్చాడు కోహ్లీ కూతురు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమే.. తను ప్రశాంతంగా నిద్రపోవడానికి తనకు ఒక రూం సపరేట్ గా ఉంచామని తెలియజేశాడు. ఇక వీరిద్దరూ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: