లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు తమిళం ఇటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌. పరిశ్రమకు వచ్చి చాలా రోజులు అవుతున్నా... ఆమె క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. వెంకటేష్‌ హీరోగా నటించిన లక్ష్మి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచమైన నయన్‌.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. స్టార్‌ హీరోల సరసన నటించి మంచి స్థాయికి ఎదిగింది.  చంద్ర ముఖి, బాస్‌, మరియు వల్లభ సినిమా నయన్‌ కెరీర్‌ ను మార్చేశాయి. ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటేడ్‌ మూవీస్‌ మాత్రమే చేస్తోంది నయన తార.  అయితే.. నయన తారకు సినిమా ల్లో ఎంత క్రేజ్‌ ఉందో... బయట కూడా అంతే క్రేజ్‌ ఉంది. ఈ లేడీ సూపర్‌ స్టార్‌... ప్రేమ లో పడి అందరినీ ఆశ్చర్య పరిచింది.

 ఒక్కరితో ప్రేమాయణం అయితే...కామన్‌ గా ఉండేది. కానీ ఈ లేడీ సూపర్‌ స్టార్‌ ఏకంగా ముగ్గురితో ప్రేమాయణం నడిపింది.  మొదట్లో కోలివుడ్‌ సూపర్‌ స్టార్‌ హీరో శింబుతో లవ్‌ ట్రాక్‌ నడిపింది. పెళ్లి చేసుకుంటారనే టైమ్‌ లోనే వాళ్లిద్దరూ దూరం అయిపోయారు. హీరో శింబు మరియు నయన తార మధ్య కొన్ని విషయాల్లో.. విభేదాలు తలెత్తడంతో... బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇక అనంతరం ప్రభుదేవా తో ప్రేమాయణం నడిపింది ఈ లేడీ సూపర్‌ స్టార్‌. వీరిద్దరూ కూడా చాలా రోజులు చిట్టా పట్టాలు వేసుకుని బాగానే తిరిగారు. అప్పట్లో వీరి జంట పై కూడా చాలా రూమర్స్‌ వచ్చాయి. ఇక పెళ్లి చేసుకుంటారనే నేపథ్యం లో.. ప్రభుదేవాకు హ్యాండ్‌ ఇచ్చేసింది నయన తార. దీంతో రెండో బంధానికి కూడా బ్రేక్ పడింది.

ఇక ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ తో లవ్‌ లో ఉంది నయన తార. అంతేకాదు.. ఈ జంట ఎంగేజ్మెంట్‌ కూడా చేసేసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్‌ నయన తారే స్వయంగా చెప్పేసింది. నెట్రికన్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది నయన తార. ఈ సందర్భంగా ఎంగేజ్మెంట్‌ అయిన రింగ్ ను కూడా చూపించింది నయన్‌. విగ్నేష్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన నయన తార.. త్వరలోనే పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ చేసుకుంటామని చెప్పింది. అయితే.. ఈ  పెళ్లి కూడా జరుగుతుందా? మొదట్లో జరిగినట్లే.. క్యాన్సల్‌ అవుతుందా? అనే ప్రశ్న నయన్‌ తార ఫ్యాన్స్‌ తో పాటు మిగతా వారిలోనూ తలెత్తుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: