అమ్మాయిలు అబ్బాయిలు కలిసి స్నేహంగా ఉండటం పెద్ద  విషయం ఏమీ కాదు. అలా స్నేహంగా ఉన్న వారు మరియు ప్రేమలో ఉన్న వారు తమ జీవితంలో ఎదుర్కొన్న సంతోషమైన క్షణాలను మరియు మధురమైన జ్ఞాపకాలను ఎప్పుడూ గుర్తు ఉండేలా వీడియోలు తీసుకోవడం వారు వాటిని పర్సనల్ గా దాచుకోవడం కూడా పెద్ద విషయం ఏమీ కాదు. కాకపోతే  ఇలా వారు సన్నిహితంగా గడిపిన క్షణాలకి సంబంధించిన ఫోటోలు మరియు వారి పర్సనల్ వీడియోలు ఏమైనా బయటకు వస్తే మాత్రం అతి పెద్ద సమస్య అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది ప్రముఖ భోజపురి నటి త్రిషకర్‌ మధు. ఈ నటి తన బాయ్ ఫ్రెండ్ తో కలసి  ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో  తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన త్రిషకర్‌ మధు దేవుడు అన్నీ చూస్తున్నాడు. కొందరు కావాలనే నా పరువు తీయడానికి ఈ వీడియోను లీక్ చేసి వైరల్ చేస్తున్నారు.

 జనాలు మరీ ఇంత చీప్ గా ఆలోచిస్తారు అని నేను అసలు ఊహించలేదు అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే ఈ  పర్సనల్ వీడియో ఎలా బయటికి వచ్చింది అనేది ఈ నటి క్లారిటీ ఇవ్వలేదు. ఇది లా ఉంటే ఈ వీడియో లీక్ వెనక స్వయంగా నటి మధు నే ఉందని, పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తుంది అని నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. పాపులారిటీని పెంచుకోవడం కోసమే త్రిషకర్‌ మధు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది అని నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. కాగా 'హమ్ హై హిందుస్తానీ' అనే భోజపురి సీరియల్ తో తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ బెంగాలీ నటి ఆ తర్వాత పలు ఐటమ్ సాంగ్ లలో నటించి మంచి క్రేజ్ ను  తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: