లేడీ సూపర్  స్టార్ నయనతార మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'చంద్రముఖి' సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించింది. చంద్రముఖి సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ తో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు దక్కాయి. అందులో భాగంగానే  వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఇలాంటి సీనియర్ హీరోయిన్ హీరోలతో మాత్రమే కాకుండా కుర్ర హీరోలతో కూడా ఆడిపాడి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత కోలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా వరుస విజయాలతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతోంది.

 ఇదిలా ఉంటే నయనతార విఘ్నేష్‌శివన్ తో ప్రేమలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఏదో రకంగా వార్తల్లో రావడమే తప్ప వీరిద్దరూ ఎప్పుడూ పెదవి విప్పింది లేదు. అయితే నయనతార  ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ మరియు పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. మా (విఘ్నేష్, నయన్‌) ఇద్దరి కుటుంబ  సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరిగింది. చాలా పెద్దగా సంబరాలు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాం. మా పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు. ముహూర్తం ఖరారు అయిన వెంటనే నా అభిమానులకు చెబుతాను. రహస్యంగా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. వృత్తి పరంగా మా టార్గెట్లను  సాధించే పనిలో బిజీగా ఉండటం వల్ల ఇప్పటివరకు పెళ్లి గురించి సరైన నిర్ణయం తీసుకోలేదు. విఘ్నేష్‌శివన్ ఎప్పుడో నా బాయ్ ఫ్రెండ్ స్టేజ్ దాటిపోయాడు. విఘ్నేష్‌ నాకు కాబోయే భర్త. మీడియా వారు కూడా ఇకపై వారి కథనాల్లో ఇలాగే రాస్తారు అని ఆశిస్తున్నాను. అని నయనతార పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: