టాలీవుడ్ లో వరుసగా
రీమేక్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు మన హీరోలు. పెద్ద పెద్ద హీరోలు సైతం
రీమేక్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎంతో ఈజీగా
రీమేక్ సినిమాలను చేసి హిట్టు కొట్టి తమ రేంజ్ ని పెంచుకునే విధంగా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు చిన్న హీరోలు సైతం ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో
రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే
హీరోయిన్ లు కూడా
రీమేక్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు తెలుగులో పాపులారిటీ ఉన్న
హీరోయిన్ లతో
సినిమా చేయడానికి కొంత మంది నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో దట్ ఈజ్ మహాలక్ష్మి పేరుతో
రీమేక్ చేసిన ఈ నేపథ్యంలోనే మరొక సూపర్ హిట్ సినిమాను కూడా తెలుగులో
అనుష్క రీమేక్ చేసే విధంగా ముందడుగు వేస్తుంది.
ఇటీవలే ఓ టీ టీ లో విడుదలైన
నయనతార నటించిన నెత్రికన్
సినిమా తెలుగులో
రీమేక్ చేయడానికి కొంత మంది నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అందరూ
అనుష్క హీరోయిన్ గా చేసే విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొంతమంది
సినిమా విశ్లేషకుల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఆల్రెడీ తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమాను తెలుగులో
రీమేక్ చేసి ఏం సాధిస్తారు అందులోనూ ఈ సినిమాకు పెద్దగా పేరు కూడా రాలేదు. అంధురాలు గా మారిన ఓ యువతి సైకో కిల్లర్ ను ఈ విధంగా తన తెలివితేటలతో పోలీసులకు పట్టించింది అనే కథాంశంతో ఈ
సినిమా తెరకెక్కింది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ తెలుగులోకి వచ్చిన ఈ
సినిమా తెలుగులో తెరకెక్కించి ఏ విధంగా విజయం సాధిస్తారో చూడాలి.